Begin typing your search above and press return to search.
తెలుగు తమ్ముళ్లకు కొత్త టెన్షన్ తెస్తున్న కన్నా
By: Tupaki Desk | 22 Feb 2023 9:22 AM GMTరాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయటం కష్టం. అప్పటివరకు ఉన్న దానికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటిదే ఒక ఉదంతం ఇప్పుడు సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి బయటకు వచ్చేయటం.. ఆయన టీడీపీలో చేరతారన్న విషయంపై క్లారిటీ వచ్చేయటం తెలిసిందే. ఈ అంచనాలకు తగ్గట్లే ఆయన గడిచిన రెండు మూడు రోజులుగా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. తనకు తెలిసిన నేతలను కలవటం.. వారితో భేటీ కావటం చేస్తున్నారు.
అంతేకాదు.. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నప్పుడు సత్తెనపల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తంగా సత్తెనపల్లి నుంచి తాను పోటీ చేస్తున్న సంకేతాల్ని ఆయన ఇస్తున్నారు. కన్నా హడావుడి ఇలా ఉంటే.. ఆయన దెబ్బకు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి. ఇప్పుడు ఎలా స్పందించాలో అర్థం కావటం లేదని వాపోతున్నారు.
ఇంతకాలం తమకు సీటు గ్యారెంటీ అనుకున్న నేతలకు సైతం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవటంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితి. తమ ఆవేదనను లోకేశ్ ను కలిసి చెప్పుకున్న వారికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని.. వారికి న్యాయం చేస్తామన్న హామీని ఇస్తూ బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సత్తెనపల్లి సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు గడిచిన కొంతకాలంగా సత్తెనపల్లిలో తిరుగుతూ అక్కడ పార్టీ కార్యకలాపాల్ని వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి అయోమయంలో పడింది.
ఇంకోవైపు మాజీ మంత్రి కమ్ మాజీ స్పీకర్ గా వ్యవహరించి కోడెల తనయుడు శివరాం పరిస్థితి కూడా అర్థంకానట్లుగా మారిందంటున్నారు. తండ్రి మరణం తర్వాత టికెట్ ఆశించిన శివరాంను చంద్రబాబు పక్కన పెట్టటం తెలిసిందే. తండ్రి హయాంలో అతగాడి తీరుతో ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు.. ఆయన్ను కలిసేందుకు కూడా ఇష్టపడే వారని చెబుతారు.
అలాంటిది ఈ మధ్యనే చంద్రబాబును కలిసిన సందర్భంగా నియోజకవర్గంలో పని చేయాలని చెప్పినట్లుగా చెబుతారు. అయితే.. కోడెల ఎంట్రీతో ఆయనకు టికెట్ అవకాశాలు అస్సలు లేవని తేల్చేస్తున్నారు. ఇలా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ.. సత్తెన పల్లి నుంచి పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్న వారందరికి కన్నా రూపంలో పెద్దషాకే తగిలినట్లుగా చెప్పాలి. దీంతో.. వారేం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.