Begin typing your search above and press return to search.
కేవీపీపై ఎదురుదాడి మొదలైంది
By: Tupaki Desk | 8 Jan 2017 10:17 PM ISTకాంగ్రెస్ పార్టీ ఎంపీ - దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరొంది కేవీపీ రామచంద్రరావుపై తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేవీపీ రాసిన లేఖపై పార్టీ సీనియర్ నేత - ప్రభుత్వ ఛీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ఘాటు విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య పరువు నిలబెడతానని కేవీపీ లేఖలు రాయడం హాస్యాస్పదమని తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖలో మండిపడ్డారు. కేవీపీ రామచంద్రరావు పదే పదే లేఖలు రాస్తూ పాపాలనుండి గట్టెక్కాలని ప్రయత్నించొద్దని దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే ట్రస్టు రూపంలో ఆస్తులను దానం చేయాలని కోరారు.
అసమాన రాష్ట్ర విభజన అనంతరం నడిరోడున పద్ద సీమాంధ్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు అండగా నిలబడుతూ రాత్రింబవళ్లు శ్రమించి 70 ఏళ్ల ఆంధ్రుల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టును సాకారం చేసే దిశగా తుది అడుగులు వేస్తున్నారని కాలువ శ్రీనివాసులు ప్రశంసల జల్లులో ముంచెత్తారు. దీన్ని అడ్డుకునే క్రమంలో భాగమే లేఖల డ్రామా అని ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో ప్రధాన నిర్మాణమైన స్పిల్ వే కాంక్రిట్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో కాంగ్రెస్ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆరోపించారు. విభజన చట్టం చేసే సమయంలో 7 ముంపు మండలాలను ఏపీలో కలపాలని ఎందుకు ప్రైవేటు బిల్లు పెట్టలేదని కాలువ ప్రశ్నించారు.
వైఎస్ హయాంలో సీఎం పేషీ అధికారులు పలు కాంట్రాక్టులు, నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ ప్లీడర్ల నియామకం ఫైళ్ళను కేవీపీ పరిశీలించేవారని కాలువ ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో సీయం క్యాంప్ ఆఫీసు, సెక్రటేరియట్లోని "డీబ్లాక్"ను దొంగల డెన్లుగా మార్చారని ఘాటు విమర్శలు చేశారు. తెలుగు ప్రజలకు సేవ చేయదలచుకుంటే ట్రస్టు ఏర్పాటు చేసి కేవీపీ అక్రమ సంపాదనను ప్రజలకు పంచాలని కాలువ శ్రీనివాసులు సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/