Begin typing your search above and press return to search.
కేఏ పాల్.. డిజార్డర్ తో తంటాలు పడుతున్నాడా!
By: Tupaki Desk | 17 April 2019 7:59 PM ISTపోలింగ్ కు ముందంతా తన మాటలతో, చేష్టలతో హంగామా రేపిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోలింగ్ తర్వాత కూడా అదే హంగామా చేస్తూ ఉన్నారు. ఈ సారి కేఏ పాల్ ఎన్నికలను బహిష్కరించాలని అంటున్నారు. ఈ విషయంలో తను అన్ని పార్టీలతోనూ చర్చలు జరుపుతున్నట్టుగా, ఇప్పటికే సీతారం ఏచూరిని ఒప్పించినట్టుగా కూడా ఈయన చెబుతున్నాడు. జనాలను నవ్వించడం కాదు, మరీ విస్తుపోయేంత స్థాయిలో కామెడీ చేస్తున్నారు కేఏపాల్!
ఎన్నికలు సాగినంతసేపూ కామెడీ చేసి వెళ్లిన కేఏ పాల్, ఆ సందర్భంగా ప్రవర్తించిన తీరు జనాలకు కూడా వినోదం అయ్యింది. పాల్ ను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఒట్టి కమేడియన్ గానే చూశారు. అసలు విషయానికి వస్తే కేఏ పాల్ కు నిజంగానే మెంటల్ డిజార్డర్ ఉందనే మాట వినిపిస్తూ ఉంది. పాల్ ప్రవర్తనే అందుకు సాక్ష్యమని స్పష్టం అవుతోంది. పాల్ ఈ ఎన్నికల సమయంలో ఎంత ఎంత వింతగా ప్రవర్తించాడో అందరికీ తెలిసిన సంగతే.
డ్యాన్సులు చేయడం, కారు సీట్లోనే ఊగిపోవడం, తెలుగుదేశం కార్యకర్తలతో డ్యాన్సులు వేయడం,పవన్ కల్యాణ్ ను అనుకరించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ప్రపంచాన్ని తనే శాసిస్తున్నట్టుగా చెప్పుకోవడం, అత్యంత అసంబద్ధమైన హామీలు ఇవ్వడం..ఇవన్నీ కూడా ఆయన డిజార్డర్ కు ఉన్న సంకేతాలు అని అంటున్నారు పరిశీలకులు. ఇక పోలింగ్ రోజు అయితే పాల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకుని ఊపాడు.
ఇక పోలింగ్ పూర్తి అయ్యాకా ఆయన కొత్త విషయాలు చెబుతున్నాడు. మొత్తం రిగ్గింగ్ అయిపోయిందని, మోడీ రిగ్గింగ్ చేశాడని, తదుపరి పోలింగ్ దశలను పార్టీలన్నీ బహిష్కరించాలని పాల్ అంటున్నాడు. ఇప్పటికే తను ఈ విషయంలో పార్టీలతో చర్చించినట్టుగా చెబుతున్నాడు.
ఇవన్నీ చూస్తే, ఈయన నేపథ్యాన్ని బట్టి చూస్తే.. ఆయన మతిస్థిమితం మీద గట్టి అనుమానాలు కలుగుతూ ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనాలు కూడా పాల్ ను మతిస్థిమితం లేని వ్యక్తిగానే ట్రీట్ చేస్తున్నారనుకోండి!