Begin typing your search above and press return to search.

అక్కడ అయితే చంద్రబాబుకి 15 ఏళ్లు జైలుశిక్ష పడేది: కేఏ పాల్‌ హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   2 Jan 2023 9:05 AM GMT
అక్కడ అయితే చంద్రబాబుకి 15 ఏళ్లు జైలుశిక్ష పడేది: కేఏ పాల్‌ హాట్‌ కామెంట్స్‌!
X
గుంటూరు టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రన్న కానుకలు, అన్నగారి జనతా వస్త్రాలు అందజేస్తామని ప్రకటించడంతో భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ ఘటనలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందిన ఘటనపై అధికార వైసీపీ నేతలు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ కోవలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సైతం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబూ మాకు ఇదేమీ ఖర్మ..? అని కేఏ పాల్‌ ప్రశ్నించారు. కందుకూరులో మీటింగ్‌ పెట్టినప్పుడే తాను చంద్రబాబుకు వార్నింగ్‌ ఇచ్చానని గుర్తు చేశారు. అయినా ఆయన ఒక్క శాతం కూడా మారలేదు అని కేఏ పాల్‌ మండిపడ్డారు.

అసలు డీజీపీకి బుద్ది ఉండొద్దా? చంద్రబాబు సభలకు అనుమతులు ఎలా ఇస్తారు..? అని కేఏ పాల్‌ నిలదీశారు. పది వేల మందికి అనుమతి తీసుకుని నలభై యాభై వేల మందిని సభకు తరలించారని పాల్‌ ఆరోపించారు.. అసలు, చట్ట విరుద్దమైన సభలకు ఎలా అనుమతి ఇస్తారు అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో అయితే చంద్రబాబుకి 15 ఏళ్ల శిక్ష పడేదన్నారు. ప్రజలకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కేఏ పాల్‌ అన్నారు.

చంద్రబాబు ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు ఆరోపిస్తున్నారని కేఏ పాల్‌ గుర్తు చేవారు. మరి ఈ విషయంలో సీఎం జగన్‌ కూడా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకి కూడా తానున అప్పులు ఇప్పిచ్చానని కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గుంటూరులో తొక్కిసలాట జరిగితే.. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ ఏమయ్యాడు? అని ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నా పవన్‌ స్పందించడా..? అని నిలదీశారు. సినిమాలేవో చేసుకోకుండా పవన్‌కు రాజకీయాలు ఎందుకని పాల్‌ వ్యాఖ్యానించారు. తాను తప్ప ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని కేఏ పాల్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కాగా ఇటీవల కందుకూరులో టీడీపీ సభలో 8 మంది మృతి చెందడంపైనా కేఏ పాల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా స్వయంగా కందుకూరులో ఆయన పర్యటించారు. చంద్రబాబుపై పోలీసుస్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా గుంటూరు ఘటనపై కేఏ పాల్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పాల్‌ కామెంట్స్‌ పై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.