Begin typing your search above and press return to search.
జస్ట్ టూ డేస్ : బాబు రికార్డుని కేసీయార్ బద్ధలు కొట్టేస్తారా...?
By: Tupaki Desk | 31 May 2023 5:23 PM GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఇప్పటిదాకా ఒక గొప్ప రికార్డు ఉంది. ఈ రికార్డుని రెండు దశాబ్దాలు దగ్గరపడుతున్నా ఎవరూ బద్ధలు కొట్టలేకపోయారు. చంద్రబాబు సైతం అనేక సభలలో తన ముచ్చటైన రికార్డుని ఒకటికి పదిమార్లు గొప్పగా గర్వంగా చెప్పుకుంటూ ఉండేవారు. తాను ఉమ్మడి ఏపీలో అధిక కాలం సీఎం గా పనిచేసిన నాయకుడిని అని ఆయన అంటూ ఉంటారు.
ఉమ్మడి ఏపీలో చూస్తే బాబు రికార్డు ఈ రోజు దాకా చెక్కుచెదరనిదే. అయితే విభజన తరువాత మాత్రం ఒక తెలుగు రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన సీఎం ఎవరు అంటే చంద్రబాబు కాదు అని కేసీయార్ గట్టిగా చెప్పబోతున్నారు. 2014లో ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయింది. ఆనాటి నుంచి సీఎం గా ఉన్న కేసీయార్ 2023 జూన్ 2 నాటికి తొమ్మిదేళ్ళు సీఎం గా పూర్తి చేసుకోబోతున్నారు.
ఇక చంద్రబాబు రికార్డు ఏంటి అదెలా బద్ధలు కాబోతోంది అన్నది తెలియాలంటే లెక్కలు అన్నీ చూడాలి. చంద్రబాబు మొత్తం మూడు సార్లు సీఎం గా పనిచేశారు. ఆయన 1995 సెప్టెంబర్ 1న సీఎం గా ఉమ్మడి ఏపీలో ప్రమాణం చేశారు. ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో రెండవమారు గెలిచారు. 2004 మే దాకా ఆయన ఉమ్మడి ఏపీకి సీఎం గా కొనసాగారు. అలా బాబు పాలించిన కాలాన్ని తీసుకుంటే ఎనిమిది సంవత్సరాలు 256 రోజులు చంద్రబాబు ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారని లెక్క తేలింది.
అదే ఉమ్మడి ఏపీలో బాబు కంటే ముందు అత్యధిక కాలం పాలించిన రికార్డు కాసు బ్రహ్మానందరెడ్డికి ఉంది. ఆయన ఏడేండ్ల 221 రోజులు ముఖ్యమంత్రిగా పని చేసారు. ఎన్టీయార్ అయితే ఏడేళ్లకు పైగా పనిచేశారు వైఎస్సార్ ని తీసుకుంటే అయిదు సంవత్సరాలు 111 రోజులు సీఎం పదవిలో కొనసాగారు. ఇలా ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎం గా పనిచేసిన రికార్డు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటిదాకా బాబు పేరు మీదనే ఉంది.
ఇపుడు దాన్ని కేసీయార్ బద్ధకు కొట్టబోతున్నారు. ఆయన జూన్ 2 నాటికి సీఎం గా బాధ్యతలు స్వీకరించి. తొమ్మిదేళ్ళు ఏక బిగిన ఒక స్టేట్ కి సీం గా పనిచేసిన రికార్డుతో కేసీయార్ బాబుని పక్కన పెట్టేస్తున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు 2014 జూన్ 8 నుంచి 2019 మే 23 దాకా సీఎం గా పనిచేశారు. అంటే ఈ అయిదేళ్ళ కాలాన్ని తీసుకుంటే బాబు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా 13 ఏళ్ళ 247 రోజులు పాలించినట్లుగా ఉంటుంది.
కానీ విభజన తరువాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే కాబట్టి బాబు రికార్డు తెలంగాణాలో బద్ధలు అవుతోంది. ఏపీలో చూస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళకపోతే బాబుతో సమానంగా విభజన ఏపీని పాలించిన వారుగా ఉంటారు. 2024 ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారిదే అసలైన రికార్డు అవుతుంది. చూడాలి మరి ఏమి జరగనుందో.