Begin typing your search above and press return to search.

అభిమాని మరణంపై ఎన్టీఆర్ ఆవేదన ఇది!

By:  Tupaki Desk   |   27 Jun 2023 2:00 PM GMT
అభిమాని మరణంపై ఎన్టీఆర్ ఆవేదన ఇది!
X
జూ. ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పదంగా మృతిచెందిన సంగతి తెలిసిందే! ఈ ఘటనపై యావత్ ఎన్టీఆర్ అభిమానులు కన్నీటిసంద్రమయ్యారు. ఇప్పటికే ఈ మరణంపై విచారణకు అన్నివైపుల నుంచీ డిమాండ్స్ వస్తున్నాయి. ఈ సమయంలో తన అభిమాని అనుమానాస్పద మృతిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

అవును... తన వీరాభిమాని శ్యామ్ మృతిపై ఎన్టీఆర్ స్పందించారు. "శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఒక నోట్ విడుదల చేశారు.

అయితే ఈ ఘటనపై ఇప్పటికే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు స్పందించారు. ఇదే సమయంలో నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా శ్యామ్ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ.. దర్యాప్తుకు డిమాండ్ చేశారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతోపాటు.. ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది!

కాగా... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యామ్.. గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఇతను ఉరి వేసుకుని మరణించినట్లు తెలుస్తుంది. దీంతో ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు.

శ్యామ్ ఉరి వేసుకుని చనిపోయేంత పిరికివాడు కాదని స్నేహితులు అంటున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటం.. జేబులో గంజాయి కూడా దొరికిందని కథనాలొస్తున్న వేళ మరింత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉరి వేసుకుని చనిపోయుంటే కాళ్లు నేలపై ఎలా ఆనించి ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో... పలు హారోల అభిమానులందరూ ఎకమై, శ్యామ్ కు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో #WeWantJusticeForShyamNTR పేరుతో ట్విట్టర్‌ లో ట్రెండ్‌ చేస్తున్నారు.