Begin typing your search above and press return to search.
జూ. ఎన్టీఆర్ అభిమాని మృతి... విచారణకు చంద్రబాబు డిమాండ్!
By: Tupaki Desk | 27 Jun 2023 12:35 PM GMTఇటీవల జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వీరభిమాని శ్యామ్ మరణం.. రాజకీయ రంగు పులుముకొంటుంది. శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాలపై విచారణకు ఇప్పటికే పలు డిమాండ్లు రాగా.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆన్ లైన్ వేదికగా డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలోని చింతలూరు గ్రామానికి చెందిన శ్యామ్ ఉరివేసుకుని మృతిచెందగా.. అతని శరీరంపై గాయాలు కనిపించాయి. అదేవిధంగా... శరీరం పూర్తిగా నేలపై తాకి ఉందని చెబుతున్నారు. దీంతో.. శ్యామ్ ది ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు... శ్యామ్ మరణంపై ట్వీట్ చేశారు. దీంతో.. శ్యామ్ మరణ సంఘటన ఏపీ పాలిటిక్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... శ్యామ్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాడం చేశారు. ఇదే సమయంలో... ఈ ఘటనలో వైసీపీ సభ్యుల ప్రమేయం ఉందని చంద్రబాబు ఆరోపించారు.
ఇదే సమయంలో... శ్యామ్ మరణంపై నారా లోకేశ్ కూడా స్పందించారు. శ్యామ్ అనుమానాస్పద మరణం అత్యంత బాధించిందని లోకేష్ అన్నారు. శ్యామ్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ సందర్భంగా లోకేశ్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎలాంటి రాజకీయ ప్రభావం చూపకుండా శ్యామ్ డెత్ మిస్టరీ కేసును విచారించాలని ఆయన పోలీసులను కోరారు. ఈ సంఘటనలో వైసీపీ లీడర్లకు సంబంధం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారని.. ఆ క్రమంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ఇదే క్రమంలో శ్యామ్ మృతిపట్ల నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇతర హీరోల అభిమానులు సైతం ఏకమై.. శ్యామ్ కు న్యాయం జరగాలంటూ కోరుతున్నారు. #WeWantJusticeForShyamNTR పేరుతో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
కాగా... గతంలో విశ్వక్ సేన్ సినిమా "దాస్ కా దమ్కీ" ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ తోఫొటో దిగేందుకు శ్యామ్ ప్రయత్నించాడు. బాడీగార్డులు నెట్టేసినా ముందుకు వెళ్లాడు. దీంతో... ఎన్టీఆరే స్వయంగా శ్యామ్ తో ఫోటో దిగారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.