Begin typing your search above and press return to search.
పడవ బోల్తా: జనసైనికులు కదలండి
By: Tupaki Desk | 15 Sept 2019 4:42 PM ISTతూర్పు గోదావరి జిల్లా కచులూరు సమీపంలోని గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంపై ఏపీ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు - పవన్ కళ్యాణ్ లు స్పందించారు. దీనిపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టి బాధితులకు అండగా నిలవాలని కోరారు.
కాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 50 మంది గల్లంతయ్యారని తెలిసిందని.. ఇది తనను ఎంతగానో బాధించిందని తెలిపారు. పర్యాటకుల ఆచూకీ - ఇతర సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ నేతలు, జనసేన కార్యకర్తలకు పవన్ ఆదేశించారు. వెంటనే ప్రమాద స్థలికి వెళ్లాలని జనసైనికులను కోరారు.
పవన్ ఆదేశంతో తూర్పు గోదావరి జిల్లా జనసైనికులు ప్రమాద స్థలికి తరలివచ్చారు. బాధితులకు సాయం చేస్తూ కొంత మందిని రక్షిస్తూ సహాయక చర్యలు పాల్గొన్నారు. ఇక వీరికి తోడుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి.