Begin typing your search above and press return to search.
పవన్ పసిగట్టేశారు...అందుకే గోదావరి నుంచే...!
By: Tupaki Desk | 2 Jun 2023 4:05 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారని, తన పని తాను చేసుకుపోతున్నారు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఆయన పొలిటికల్ గా అప్డేట్ గానే ఉన్నారు. ఏపీలో ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా దానికి తగ్గట్లుగా రియాక్ట్ అవుతున్నారు. జగన్ ఢిల్లీ ఈ మధ్య వెళ్లి వచ్చారు . కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన కలుసుకుని కీలక చర్చలు జరిపారు.
జగన్ ఏపీకి రావడంతోనే ముందస్తు ఎన్నికల ఊహాగానాలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అసలు దాని కంటే ముందు చంద్రబాబు మహానాడులో మినీ మ్యానిఫేస్టోని రిలీజ్ చేశారు. అంటే ముందస్తు ఎన్నికల సన్నాహమే ఇది అంటున్నారు. బాబుకు తెలిసింది. పవన్ కి తెలియకుండా ఉంటుందా.
దాంతో ఆయన ముందస్తు ఎన్నికలు నవంబర్ డిసెంబర్ లలో జరుగుతాయని గట్టిగా భావిస్తున్నారు తాను కమిట్ అయిన సినిమాలకు విరామం ప్రకటించి మరీ ఆయన వారాహి రధమేసుకుని రోడ్ల మీదకు రాబోతున్నారు. తొందరలోనే పవన్ వారాహి ఏపీ రోడ్ల మీద కనిపిస్తుంది అని అంటున్నారు.
దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ని ఖరారు చేసే పనిలో ఆ పార్టీ ఉంది. జనసేనకు గట్టి పట్టు ఉన్న గోదావరి జిల్లాల నుంచే వారాహి రధ యాత్రను చేపడతారు అని అంటున్నారు. సాధ్యమైనత త్వరలోనే ఈ యాత్ర ఉంటుంది అని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు అంటే కచ్చితంగా నాలుగైదు నెలల సమయం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే బరిలోకి దిగిపోవడం బెటర్ అని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు.
ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికలకు సంబంధించి తమ పట్టు బాగా ఉన్న ఉభయ గోదావరి నుంచే వారాహి రధయాత్రకు శ్రీకారం చుట్టడం ద్వారా పవన్ అక్కడ అధిక సీట్లు పొత్తులో డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ ముప్పయి నాలుగు సీట్లు ఉన్నాయి. ఇందులో సగం సీట్లు అయినా జనసేన కోరుకోవచ్చు అంటున్నారు. అంటే 17 నుంచి 18 సీట్లను జనసేనకు తప్పకుండా కేటాయించాల్సిందే.
ఈ మధ్యనే మంగళగిరికి వచ్చి అక్కడ పార్టీ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ జనసేనకు బలం ఉన్న సీట్ల మీద తాము స్వయంగా చేయించుకున్న సర్వే నివేదికలను పరిశీలించారని అంటున్నారు. జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలలో 36 శాతానికి పైగా బలం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో అక్కడ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడమే జనసేన ముందు ఉన్న కర్తవ్యం అని అంటున్నారు.
ఇక టీడీపీ కూడా గోదావరి జిల్లాల మీదనే ఫోకస్ పెట్టేసింది. మహానాడుని అక్కడే నిర్వహించింది. తమ బలమేంటో చూపించింది. దాంతో జనసేన కోరినన్ని సీట్లు ఇస్తుందా లేదా అన్నది చూదాలని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాత్రం తమ బలం మిత్రులకు ప్రత్యర్ధులకు చూపించడానికి వారాహిని రోడ్ల మీదకు తెస్తున్నారు అని అంటున్నారు. మొత్తనికి ఇది జన సైనికులకు శుభ వార్త అని అంటున్నారు.
వారాహి రధం గత ఏడాది అన్నీ ముస్తాబు చేసుకుని పూజలు కూడా పూర్తి చేసుకుని షెడ్ లోనే ఇంతకాలం ఉండిపోయింది. ఇపుడు వారాహి రధంలో పవన్ జనంలోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి ఏపీ రాజకీయాన్ని వేడేక్కించేందుకు వారాహి రధ యాత్ర ఉపయోగపడుతుంది అని అంటున్నారు.