Begin typing your search above and press return to search.
రెడ్డిగారు..మీరెంత మంచివారు
By: Tupaki Desk | 9 Jun 2015 3:18 PM ISTనల్లగొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తన అసలు రూపం చూపించి శివాలెత్తిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు మొదలుకొని ..నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ నేతల వరకు అందరిపై తనదైన శైలిలో తిట్ల దండకం అందుకున్నారు. దొడ్డుగా ఉన్నవాళ్లు...పొడవు ఉన్నవాళ్లు ఏం చేశారంటూ పేర్లు పెట్టుకుండా సీఎల్పీ నేత కె. జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలను దూషించారు. ఈ రేంజ్ లో కేసీఆర్ ఎందుకు విమర్శలు చేయాల్సి వచ్చిందనే చర్చ పెద్ద ఎత్తున్నే సాగింది. అయితే...దీనిపై జానారెడ్డి చాలా కూల్ గా రియాక్టయ్యారు.
తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత కూడా లేకుండా..కేసీఆర్, టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాధ్యమైందన్న వాస్తవాన్ని అంతా గ్రహించాలన్నారు. తెలంగాణ, ఇతర అంశాల్లో కాంగ్రెస్ ను విమర్శించి పబ్బం గడుపుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ వలే తాను వ్యక్తిగత దూషణలకు పాల్పడలేనని...హుందాగానే వ్యవహరిస్తానని జానారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు కొంత రాజీ అవసరమని భావించి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో అప్పట్లో కేసీఆర్ కూడా అంగీకరించారని తెలిపారు.
అసెంబ్లీలో, ఇతరత్రా చోట్ల ప్రస్తావన వచ్చినపుడల్లా కేసీఆర్ అన్నట్లు...పెద్దలు జానారెడ్డి మృదు స్వభావిచ హుందాగా ఉంటారు. అనే మాటలను నిజం చేస్తూ వ్యవహరించడం నిజంగా..జానారెడ్డికే చెల్లిందేమో.