Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు చెమటలు పట్టే మాట చెప్పిన జగన్

By:  Tupaki Desk   |   21 Sep 2022 9:30 AM GMT
చంద్రబాబుకు చెమటలు పట్టే మాట చెప్పిన జగన్
X
తాము టార్గెట్ చేసే వారు ఎవరైనా సరే.. ఊపిరి పీల్చుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. వారు ఆ షాక్ లో ఉన్నప్పుడే గెలుపు మీద ఫోకస్ చేసి అనుకున్నది సాధించే రీతిలో వ్యవహరిస్తుంటారు మోడీషాలు. లక్ష్యం ఏదైనా.. దాన్ని సాధించటమే తప్పించి మరో ఆప్షన్ లేదన్నట్లుగా వ్యవహరిస్తారు మోడీషాలు. ఈ కారణమే జాతీయ స్థాయిలో అధికారాన్ని సొంత చేసుకోవటమేకాదు.. తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో ఒకట్రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తున్న వైనం తెలిసిందే.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే.. మోడీషాల ప్లానింగ్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో ఆయన రాజకీయ ఎత్తుగడలు ఉన్నట్లుగా చెబుతున్నారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన ఫలితాలు ఎలా ఉన్నా.. సీఎం జగన్ చూపంతా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మీదనే అని చెప్పాలి. ఏ రీతిలో అయితే.. మోడీషాలు టార్గెట్ చేస్తారో.. దాదాపుగా అదే ప్లాన్ ను జగన్ అమలు చేస్తున్నారని చెప్పాలి.

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోటకు ఇప్పటికే బీటలు వారేలా చేసిన జగన్.. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ నేతలు గెలిచేలా చేశారు. ఇప్పుడు చంద్రబాబును ఓడిపోయేలా చేయటమే లక్ష్యమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే కుప్పం వెళ్లిన ఆయన.. తాజాగా మరోసారి చంద్రబాబు నియోజకవర్గానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ తమ పార్టీ అభ్యర్థిని డిసైడ్ చేసిన జగన్.. అతగాడు ఎన్నికల్లో గెలిస్తే మంత్రిపదవి ఇస్తానని చెప్పటం తెలిసిందే.

మోడీషాలు ఎలా అయితే.. తాము సాధించాలనుకున్న రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ మంది.. ఎక్కువ సార్లు వెళ్లటం.. స్థానికంగా ఉండే వైరి వర్గం వారిని దగ్గరకు తీసుకోవటం.. వారితో జట్టుకట్టి.. బలోపేతం చేయటం లాంటి వ్యూహాల్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఇదంతా చూస్తే.. కుప్పం విషయంలో జగన్ ఎంత సీరియస్ గా ఉన్నారో తాజాగా టూర్ షెడ్యూల్ చూస్తే అర్థమవుతుంది. ఈ నెల 23 నుంచి కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు.

వైఎస్సార్ చేయూత పథకం కింద లబ్థిదారులకు మూడో విడత నిధులను ముఖ్యమంత్రి చేతలు మీదుగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ నెల 22న వెళ్లాల్సి ఉన్నా.. అనుకోని కారణాల వల్ల జగన్ కుప్పం టూర్ 23 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు రెండు గంటల పాటు కుప్పంలో ఉండే జగన్ తాజా షెడ్యూల్ చూశాక.. చంద్రబాబుకు టెన్షన్ తో చెమటలు పట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. కుప్పం విషయంలో జగన్ అనుసరిస్తున్న తీరు చూస్తే.. మోడీషాలను ఆయనీ విషయంలో పక్కాగా ఫాలో అవుతున్నారని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.