Begin typing your search above and press return to search.

యువ‌గ‌ళం వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. మెసేజ్ ఏంటి...?

By:  Tupaki Desk   |   13 Feb 2023 12:37 PM GMT
యువ‌గ‌ళం వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. మెసేజ్ ఏంటి...?
X
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన యువ‌గ‌ళం.. ఇప్ప‌టికి 16 రోజులు పూర్తి చేసుకుంది. అదేస‌మ‌యంలో నిర్ణీత 4 వేల కిలో మీట‌ర్ల ల‌క్ష్యంలో 200 కిలో మీట‌ర్ల దూరాన్ని కూడా నారా లోకేష్ పూర్తి చేసుకున్నారు. ఈ మొత్తం గ‌డిచిన రోజులు.. దూరాన్నిప‌రిశీలిస్తే.. యువ‌గ‌ళం వ‌ర్సెస్ జ‌గ‌న్ అన్న‌ట్టుగానే ప‌రిస్థితి మారిపోయింది. ఏ పాద‌యాత్ర అయినా.. సంబంధిత ల‌క్ష్యాన్ని చేరుకునేం దుకు ఉపయోగ‌ప‌డాలి.

కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 16 రోజుల పండుగ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నారా లోకేష్ సాధించింది ఏంటి? అంటే .. పెద్ద‌గా చెప్పుకొనేందుకు ఏమీ క‌నిపించ‌డం లేదు. పోనీ.. టీడీపీ నేత‌లు చెబుతున్న‌ట్టుగా అధికార పార్టీ పోలీసుల‌ను పుర‌మాయించి సాధించింది కూడా ఏమీ క‌నిపించ‌డం లేదు. మ‌రి ఏం జ‌రుగుతోంది? ఈ పాద‌యాత్ర‌, ఈ నిర్బంధాలు(టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న‌ట్టుగా) ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయి? అనేది ఆస‌క్తిగా మారింది.

ఒక్క‌సారి పాద‌యాత్ర‌ల విష‌యానికి వ‌స్తే.. ఏ పాద‌యాత్ర అయినా.. ల‌క్ష్యం ఒక్క‌టే ప్ర‌జ‌ల్లో సింపతీని చూ రగొనాలి. దానిని ఓట్లుగా మార్చుకోవాలి. ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాలి.

అదికారంలోకిరావాలి. అయితే.. నారా లోకేష్ యువ‌గ‌ళం ల‌క్ష్యం కూడా ఇదే. అయితే.. ఈ ల‌క్ష్య సాధ‌న‌లో లోకేష్ దూకుడు ఏమేర‌కు ప‌నిచేస్తోంది.? అంటే.. చెప్ప‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే.. ఇప్ప‌టికీ.. నారా లోకేష్‌ను చంద్ర‌బాబు కుమారుడుగానే చూస్తున్నారు. ఆయ‌న‌పై సింప‌తీ పెర‌గలేదు.

గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కూడా.. ఆయ‌న‌ను వైఎస్ కుమారుడిగానే చూసినా.. ఆయ‌న‌పై సింప‌తీ పెరిగింది. ఇక‌, ఇప్పుడు అప్ప‌టి మాదిరిగా ఈజీ లేక‌పోయినా.. లోకేష్ ఆ సానుబూతిని సంపా యించుకోవ‌డంలో వెనుక‌బడుతున్నార‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. ఎందుకంటే.. అంతో ఇంతో సాయం చేస్తున్న జ‌గ‌న్‌పై మ‌హిళ‌ల్లో సానుభూతి ఉంది. అయితే.. లోకేష్ ప‌దేప‌దే జ‌గ‌న్‌ను తిట్ట‌డంతో లోకేష్ వారికి దూర‌మ‌వుతున్నారు.

ఇక‌, పాద‌యాత్ర ఎవ‌రు చేసినా.. ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయాలి. కానీ, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆంక్ష లు పెడుతోంద‌ని.. క‌నీసం మాట్టాడేందుకు మైక్ కూడా ఇవ్వ‌డం లేద‌ని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇది కూడా మంచిదికాదు. పాద‌యాత్ర‌కు అడ్డం చెప్పినంత మాత్రాన సింప‌తీని ఆప‌లేరు. ఇలా ఈ రెండు వ‌ర్గాలు కూడా చేస్తున్న‌ కొన్నికొన్ని త‌ప్పుల కార‌ణంగా ప్ర‌జ‌ల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్ల‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశ‌ల‌కులు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.