Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ తో జాగ్రత్త..జగన్ కు ఫ్యాన్స్ సూచన!

By:  Tupaki Desk   |   29 Oct 2019 10:09 AM GMT
వల్లభనేని వంశీ తో జాగ్రత్త..జగన్ కు ఫ్యాన్స్ సూచన!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడనే ప్రచారంలో నలుగుతున్న పేరు వల్లభనేని వంశీ మోహన్. ఈయన తెలుగుదేశం పార్టీకి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. అవి కూడా సోషల్ మీడియా ద్వారా చేసిన రాజీనామాలట!

ఇలాంటి నేపథ్యంలో అంశం అలా పెండింగ్ లోనే ఉన్నట్టుంది. ఆ సంగతలా ఉంటే..వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఆ పార్టీ అభిమానవర్గాలే పెద్దగా ఆసక్తితో లేవు. ఇప్పుడు అతడెందుకు? అనే ప్రశ్నలు వారి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో కొందరు మరి కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనది పెనుకొండ ఒకప్పటి ఎమ్మెల్యే ఎస్వీ రమణా రెడ్డి హత్య. పరిటాల రవి వైరి వర్గం అయిన ఎస్వీ రమణారెడ్డి హత్య లో వల్లభనేని వంశీ మోహన్ పాత్ర ఉందని వాట్సాప్ లో కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు.

రమణా రెడ్డిని భోజనానికి అని పిలిచి..నమ్మించి పరిటాల రవి వర్గానికి చెందిన ఆర్వోసీకి సమాచారం ఇచ్చి.. రమణారెడ్డిని హత్య చేయించడంలో వల్లభనేని వంశీ కీలక పాత్ర పోషించాడని వాట్సాప్ గ్రూప్ లో వైసీపీ అభిమాన వర్గాలు అంటున్నాయి. అలాంటి వ్యక్తిని పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నట్టు? అలాంటి వ్యక్తితో పార్టీకి అవసరం ఏమిటి?

అంటూ సూటిగా వైఎస్ జగన్ నే ప్రశ్నిస్తూ కొంతమంది పోస్టులు పెడుతూ ఉండటం గమనార్హం. ఏదేమైనా వల్లభనేని వంశీ వంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని, వారిని నమ్మకూడదని వైసీపీ అభిమాన వర్గాలు అంటూ ఉన్నాయి. స్వార్థానికి ఏమైనా చేసే వాళ్లను నమ్మవద్దని వారు సూచిస్తూ ఉన్నారు.