Begin typing your search above and press return to search.

ఇది పబ్ జీ గేమ్ కాదు జగన్: చంద్రబాబు

By:  Tupaki Desk   |   5 Feb 2020 12:42 PM IST
ఇది పబ్ జీ గేమ్ కాదు జగన్: చంద్రబాబు
X
చంద్రబాబు నోటివెంట పబ్ జీ గేమ్ మాట వచ్చింది. ఆటలను రాజకీయాలను ముడిపెట్టి ఆయన ఏపీ సీఎం జగన్ పై నోరుపారేసుకున్నారు.జగన్ విధానాలు, పాలన గురించి పబ్ జీ గేమ్ ఆటలా అభివర్ణించారు.

సీఎం జగన్ ఏపీలో పరిపాలనను పబ్ జీ గేమ్ లా ఆడినంత సులువుగా చేస్తున్నారని.. అది పద్ధతి కాదని చంద్రబాబు సూచించారు. మీరు పాలన చేతికాకపోతే నిపుణులు, మేధావులు, పరిపాలన దక్షతుల నుంచి తెలుసుకోవాలని జగన్ కు సలహా ఇచ్చారు. పాలన పబ్ జీ గేమ్ కాదని.. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.

రాజధాని మార్పు, పోలవరం రివర్స్ టెండరింగ్ లో జగన్ వ్యవహరిస్తున్న తీరు పై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ప్రతీకారం తో వీటిన్నింటిని జగన్ మార్చేస్తున్నారని.. ప్రతీకార రాజకీయాలు తగవు అంటూ జగన్ ను చంద్రబాబు కోరారు.

ఏపీకి పెట్టుబడిదారులు తీసుకు రావడం.. వారితో ప్లాంట్లను పెట్టించడానికి తాను చాలా తంటాలు పడ్డానని చంద్రబాబు ఏకరువు పెట్టారు. ఎంత కష్టమో మాటల్లో చెప్పలేనని కేంద్రమంత్రులను, పారిశ్రామిక వేత్తలను బతిమిలాడనని బాబు గారు ఆవేదన చెందారు.తాను కూడా జగన్ లా వ్యవహరిస్తే అంతర్జాతీయ, జాతీయ కంపెనీలన్నీ ఏపీ నుంచి పారిపోయేవని అన్నారు. ఇలా జగన్ పై బెదిరింపులు మాని బతిమిలాడే పద్ధతి లో చంద్రబాబు మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.