Begin typing your search above and press return to search.

చంద్రబాబు తొలి యాత్రే ప్రహసనం అయ్యందా!

By:  Tupaki Desk   |   3 July 2019 5:11 PM IST
చంద్రబాబు తొలి యాత్రే ప్రహసనం అయ్యందా!
X
ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన తొలి యాత్రే ప్రహసనంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తొలి సారి పబ్లిక్ మధ్యకు వెళ్లారు. అందుకు గానూ కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. తను పోటీ చేసి నెగ్గిన చోటకే చంద్రబాబు నాయుడు వెళ్లారు. తద్వారా ప్రతిపక్ష నేతగా యాక్టివిటీస్ మొదలుపెట్టారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యవహారం ఒకటి ఉంది. గతంతో పోలిస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడుకు ఈ సారి బలంగా ఎదురుగాలి వీచింది. అలాంటి చోటకు వెళ్లి చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ డైలాగులు, తనను కుప్పం ప్రజలు చాలా ఆదరించారని అనడం, వారి రుణం తీర్చుకోలేనిది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

గతంతో పోలిస్తే ఈ సారి కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజారిటీ చాలా వరకూ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడును కుప్పం వరసగా గెలిపిస్తున్న మాట నిజమే, ఈ సారి గెలిపించిందీ నిజమే. అయితే ఈ సారి చంద్రబాబు నాయుడు మెజారిటీ దాదాపు పదిహేడు వేల వరకూ తగ్గిపోయింది. క్రితం సారి 47 వేల ఓట్ల మెజారిటీ రాగా.. ఈ సారి అది 30 వేలకు తగ్గిపోయింది!

ఇలా చంద్రబాబు నాయుడు స్థాయిని చాలా తగ్గించేశారు కుప్పం ప్రజలు. అక్కడకూ చంద్రబాబుకు ధీటైన ప్రత్యర్థి లేడు. అయినా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న ఎన్నికల్లో ఈ సారి మెజారిటీ చాలా వరకూ తగ్గిపోయింది.

ఇలాంటి నేఫథ్యంలో చంద్రబాబు నాయుడు కుప్పం కృతజ్ఞత తీర్చుకోలేనిది, వారికి ధన్యవాదాలు, తనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా చేసుకుంటోంది.. అని అనడం.. ప్రహసనంగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.