Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన భారత్

By:  Tupaki Desk   |   2 Oct 2021 4:30 AM GMT
ఇంగ్లండ్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన భారత్
X
ఎవరికి ఎన్ని చెప్పినా అర్థం కాదు. కానీ.. వారికి అర్థమయ్యే భాషలో చెప్పటం చాలా సులువు. తాజాగా భారత్ అలాంటి పనే చేసింది. ఎన్ని వినతులు చేసినా పెడచెవిన పెడుతున్న ఇంగ్లండ్ కు దానికి అర్థమయ్యే భాషలో చెప్పేసింది మోడీ సర్కారు. వ్యాక్సిన్ రేసిజం ప్రదర్శిస్తున్న సంపన్న దేశానికి.. దానికి అర్థమయ్యే భాషలో నిర్ణయం తీసుకొని టిట్ ఫర్ టాట్ అంటే ఎలా ఉంటుందో చూపించింది భారత్.

భారతదేశం నుంచి ఇంగ్లండ్ వెళ్లే వారంతా అక్కడ వ్యాక్సిక్ తప్పనిసరి అంటూ చేసిన తలతిక్క నిబంధనను సడలించాలని ప్రధానమంత్రి మోడీ మొదలు.. పలువురు వినతులు చేసినా ఇంగ్లండ్ పట్టించుకోలేదు. ఆ విషయంలో తన మొండితనాన్ని విడవకుండా వ్యవహరిస్తోంది. దీంతో.. ఆ దేశానికి అర్థమయ్యేలా భారత్ తాజాగా తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.

దీని ప్రకారం భారత్ కు వచ్చే ఇంగ్లండ్ పౌరులు తమ ప్రయాణానికి 72 గంటల ముందు మూడుసార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇంగ్లండ్ వాసులు భారత్ కు చేరుకున్న తర్వాత వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి ముందు పది రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని అధికారిక గైడ్ లైన్స్ ను పెట్టేశారు.

దీంతో.. ఇంగ్లండ్ నుంచి భారత్ కు వచ్చే వారంతా దీన్ని తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. ఇది కచ్ఛితంగా ఇంగ్లండ్ కు దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతానికి భిన్నంగా దూకుడుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజా నిబంధనల నేపథ్యంలో ఇంగ్లండ్ నుంచి భారత్ వచ్చే వారందరికి ఎదురయ్యే తిప్పలు అన్ని ఇన్ని కావు. దీంతో.. ఇంగ్లండ్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తప్పదన్న మాట వినిపిస్తోంది.