Begin typing your search above and press return to search.

మన ఎయిర్ ఫోర్స్ విమానం మిస్

By:  Tupaki Desk   |   22 July 2016 3:27 PM IST
మన ఎయిర్ ఫోర్స్ విమానం మిస్
X
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి అదృశ్యం కావటం కలకలాన్ని రేపుతోంది. చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరిన ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్ 32 విమానం ఏటీసీతో సంబంధాలు తెగిపోవటం సంచలనంగా మారింది.

29 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం జాడ కోసం ఏటీసీ అధికారులు గంట పాటు వెతికినా ఫలితం లేకుండాపోయింది. రాడార్ వ్యవస్థతో సంబంధాలు కోల్పోయిన నేపథ్యంలో.. తాజాగా ఎయిర్ ఫోర్స్ ఈ ఉదంతాన్ని అధికారికంగా ప్రకటించింది. మిస్ అయిన విమానం కోసం అధికారులు కనుగునేందుకు ప్రయత్నిస్తున్నారు.

శుక్రవారం ఉదయం 7.30గంటలకు తాంబరం ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఈ విమానం బయలుదేరిన 42 నిమిషాలకు రాడార్ తో సంబంధాలు తెగిపోవటం గమనార్హం. దీంతోఆందోళనకు గురైన అధికారులు విమానం కోసం విపరీతంగా ప్రయత్నించారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. విమానం దారి తప్పిందా? లేక జరగరానిది ఏమైనా జరిగిందా? అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. తప్పిపోయిన మిమానం కోసం ఎయిర్ ఫోర్స్ తో పాటు.. నేవీ కూడా రంగంలోకి దిగింది.