Begin typing your search above and press return to search.
జగన్‌ను తిట్టిపోసే మాజీ ఎమ్మెల్యే బామ్మర్దికి.. హైకమాండ్ ఓఎస్‌డీ పోస్ట్!!
By: Tupaki Desk | 8 Oct 2021 9:18 AM ISTరాజకీయాల్లో అయినా.. వ్యక్తిగతంగా అయినా.. ప్రత్యర్థులను దగ్గరకు ఎవరూ రానివ్వరు. ముఖ్యంగా నిత్యం తిట్టిపోసేవారైతే.. కనుచూపు మేరలో కూడా వారికి దగ్గరవ్వాలని ఎవరూ కోరుకోరు. అయితే.. వైసీపీ ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. నిత్యం జగన్‌ను తిట్టిపోసే ఓ మాజీ ఎమ్మెల్యే బామ్మర్దికి.. ఏకంగా.. ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ) కింద నియామకం ఇచ్చింది వైసీపీ సర్కారు. ప్రస్తుతం దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అయిన వారికి ఆకుల్లోనూ.. కానివారికి కంచాల్లోనూ వడ్డిస్తున్నారనే గుసగుస వినిపిస్తోంది.
నిజానికి 2014 తర్వాత.. జగన్ అధికారంలోకి రావాలంటూ.. అనేక మంది నాయకులు, కార్యకర్తలు.. అన్ని జిల్లాల్లోనూ విశేష కృషి చేశారు. కొందరు తమ సీట్లను కూడా వదులకుని.. జగన్ ఆదేశాల మేరకు పనిచే శారు. మరికొందరు అప్పులు చేసి మరీ.. పార్టీ కోసం ఖర్చు చేశారు. ఇదంతా ఎవరి కోసం.. జగన్ ముఖ్య మంత్రి కావడం కోసం. తద్వారా తమకు కూడా గుర్తింపు వస్తుందని.. ఆశించారు. మరికొందరు జగన్ పాదయాత్ర చేసినప్పుడు.. దానికి సంఘీభావంగా.. వారి వారి నియోజకవర్గాల్లోనూ.. పాదయాత్ర చేశారు. ఇలా.. అనేక మంది జగన్ కోసం.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారు.
అయితే.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇలా కష్టపడిన వారి కంటే జగన్ కి డ్యామేజ్ చేసిన వారికి మేలు జరగుతున్న ఘటనలు ఎక్కవవుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీనికి అంబానీ మనిషి నత్వానీ ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వారిని పక్కన పెడతాం.. అవి ఏదో జాతీయ సమీకరణల కింద జరిగాయనకుందాం. స్థానికంగా జగన్ నే తిట్టిని వారికి పదవులు వస్తున్నాయంటూ కింది స్థాయిలో పెద్ద ఎత్తున రూమర్లు వినిపిస్తున్నాయి. అనేక న్యూస్ ఫ్లాట్ ఫాంలలో ఈ వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా తాజాగా ఒక అధికారి గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. జగన్ తన ఓఎస్‌డీగా పొరుగు రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారిని తెచ్చి నియమించుకున్నారు. సరే.. ఇది బాగానే ఉందని అనుకున్నా... ఆయన బావ గారు ఒకపుడు జగన్ ని విపరీతంగా తిట్టిన వాడు అంట. ఆయన 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చాక వారి పంచన చేరిపోయిన వ్యక్తి అట. పార్టీ మారాక జగన్ ను ఆయన పలుమార్లు బాగా తిట్టాడు, ఆయన బావమరిదిని కీలక స్థానంలో ఎలా పెట్టుకున్నారబ్బా అంటూ సచివాలయంలో రూమర్ నడుస్తోంది.
ఆ ఎమ్మెల్యే 2019లో జగన్‌ను సెంట్రిక్‌గా చేసుకుని విమర్శలు చేసినా చిత్తుచిత్తుగా ఓడిపోయారట. ఆయన మాజీ అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అంత తిట్టిన వ్యక్తి కుటుంబానికి వైసీపీలో అగ్రపీఠం వేశారని పార్టీ వాళ్లు నొచ్చుకుంటున్నారట. జగన్ ఏరికోరి.. తెచ్చుకుని ఓఎస్‌డీ గా చేసుకుంటారా అని మదనపడుతున్నారట. అతన్ని పెట్టుకోవడం గురించి పార్టీ నేతలు బాధపడటం లేదు... కానీ ఆయన పార్టీ రహస్యలు, ప్రభుత్వ రహస్యాలు బావ గారికి మోస్తున్నారట. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది, ఈ విషయం మా బాస్ గమనిస్తే బాగుండని బాధపడి పోతున్నారట. ఆయన ఇస్తున్న సమాచారం ప్రతిపక్ష పార్టీలకు వజ్రాయుధంలా మారి వైసీపీకి నష్టం చేస్తున్నాయని మదనపడుతున్నారట.
అంటే.. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని.. సదరు ఓఎస్‌డీ.. లీక్ చేస్తున్నారన్నమాట. అది కూడా టీడీపీలో ఉన్న తన బావకు మోస్తున్నారన్నమాట. ఇక, ఈ సమాచారం.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌కు చేరిపోయి.. వారు ప్రభుత్వాన్ని అన్ని రూపాల్లోనూ ఇక్కట్లకు గురిచేస్తున్నారనేది టాక్. అయితే.. టీడీపీకి ప్రభుత్వ సమాచారం ఎలా లీక్ అవుతుందనే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతూ.. సొంత నేతలపై అనుమానపు చూపులు చూస్తోంది. దీంతో పార్టీనే నమ్ముకున్న, పార్టీ కోసం పనిచేసిన వారు.. తీవ్రంగా తెగ మథన పడుతున్నారట. మా నమ్మకానికి ఇదేనా బహుమతి, పక్కలో బల్లాన్ని పెట్టుకుని మమ్మల్ని అనుమానిస్తే ఎవరికి నష్టం అని ఫీలైపోతున్నారట.
ఆయన పేరు బయటకు రాకపోయినా చర్చ మాత్రం గట్టిగా నడుస్తోందట. ఈ న్యూస్ నిజం అయితే దీనిపై మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉన్నా.. క్రింద కామెంట్స్ రూపంలో పెట్టండి !!