Begin typing your search above and press return to search.
పీపీఈ కిట్ తో వచ్చి 25 కేజీల బంగారం దోచేశాడు ..కానీ , చివరికి ఇలా దొరికేశాడు !
By: Tupaki Desk | 21 Jan 2021 5:00 PM ISTపీపీఈ కిట్ ... కరోనా రాకముందు పెద్దగా ఎవరికీ తెలియవు. కానీ కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత పీపీఈ కిట్ల వాడకం బాగా పెరిగింది. సాధారణంగా వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు ధరించే ఈ కిట్ ని, ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి మాస్క్ గా ఉపయోగించి, ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని చోరి చేశాడు. అంతా పక్కాగా చేసినప్పటికీ పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే .. ఆగ్నేయ ఢిల్లీలోని కల్కాజీ లోని అంజలీ జ్యూయలరీ షోరూంలో జనవరి 19వ తేదీ రాత్రి గం. 9-40 కి ప్రవేశించిన దొంగ తెల్లవారుఝూమున గం.3-50 వరకు తన దోపిడీ కొనసాగించాడు. 20వ తేదీ ఉదయం షాపు తీసిన మేనేజర్ షాపులో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. దుండగుడు పక్కనున్న బిల్డింగ్ మీద నుంచి జ్యూయలరీషాపు బిల్డింగ్ లోకి వచ్చినట్లు గుర్తించారు. లోపలికి వెళ్లిన నూర్ డెస్క్ మీద నుంచి అవతలి వైపుకు దూకి.. ఆభరణాల కోసం వెతికి.. దొరికిన కాడికి తీసుకుని షో రూం నుంచి బయట పడ్డాడు. ఆ తర్వాత అతడు ఆటోలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు. ఇక అతడు షో రూంలో చేసిన విన్యాసాలు అన్ని సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఆ సమయంలో 5గురు సాయుధ గార్డులు ఉన్నప్పటికీ గురువారం తెల్లవారే వరకు తెలియలేదంటే మహమ్మద్ ఎంత గప్ చుప్ గా చోరీ చేసాడో తెలుస్తోంది. కర్నాటక లోని హుబ్లీకి చెందిన ఇతడు దక్షిణ ఢిల్లీలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాపులో పని చేస్తున్నాడట. ఇక అతడు పని చేసే షాపుకు ఎదురుగా ఓ బంగారు నగల షో రూం ఉంది. దాంతో అతడి మనసులో దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చి, పీపీఈ కిట్స్ ను ఉపయోగించి 13 కోట్ల విలువ చేసే బంగారాన్ని చోరీ చేసేశాడు.