Begin typing your search above and press return to search.

ఏపీలో మంత్రులంటే పిచ్చ లైట్..!

By:  Tupaki Desk   |   5 Jan 2018 4:56 PM GMT
ఏపీలో మంత్రులంటే పిచ్చ లైట్..!
X
అప్పుడెప్పుడో వ‌చ్చిన బొమ్మ‌రిల్లు సినిమా గుర్తుందా? అప్ప‌టిదాకా ఉగ్గ‌పట్టుకున్న హీరో.. త‌న తండ్రి పాత్ర‌ధారి ప్ర‌కాశ్ రాజ్ పై విరుచుకుప‌డ‌టం గుర్తుందా? అవును.. నాన్నా.. మీరే చేశారు.. అంతా మీరే చేశారంటూ ఆవేశంతో డైలాగులు చెప్పటం లాంటి ప‌రిస్థితే ఏపీ మంత్రుల్లో చాలామందిలో ఉంద‌ని చెబుతున్నారు.

అంతా తానే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు కార‌ణంగా రాష్ట్రంలోని మంత్రుల్ని అధికారులు పిచ్చ లైట్ తీసుకుంటున్నార‌ట‌. దీనిపై మ‌న‌సుల్లో అధినేత‌పై తీవ్ర ఆగ్ర‌హం ఉన్నా.. ఏమీ అన‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు. అధినేత ఇచ్చిన అలుసుతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. వారిని కంట్రోల్ చేయ‌ట‌మే లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

మంత్రుల విష‌యంలో తామేం చేసినా చంద్ర‌బాబు ఏమీ అన‌ర‌న్న భావ‌న పెరిగిపోయింద‌ని  మంత్రులు లోగుట్టుగా వాపోవ‌టం క‌నిపిస్తుంది. మొన్న‌టివ‌ర‌కూ మంత్రుల మాట‌ను విన‌ని అధికారులు.. ఈ మ‌ధ్య కాలంలో ప‌ట్టించుకోవ‌టం కూడా మానేశార‌ని చెబుతున్నారు. మొన్న‌టికి మొన్న హెం మంత్రి చిన‌రాజ‌ప్ప‌కు ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాల‌యం శంకుస్థాప‌న‌కు ఆహ్వానాన్ని పోస్టులో పంప‌టం.. మ‌రో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు ఇలాంటి ప‌రిస్థితే ఎదురుకావ‌టం.. దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖామంత్రి మాణిక్యాల రావును విజయవాడ ఇంద్రకీలాద్రిపైన నిర్వ‌హించే శరన్నవరాత్రి ఉత్సవాలు స‌మీక్ష‌కు ఆహ్వానించ‌క‌పోవ‌టం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మంత్రుల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంద‌ని చెబుతున్నారు.

త‌న దృష్టికి వ‌చ్చిన‌ప్పుడు ముఖ్య‌మంత్రి తూతూమంత్రంగా మంద‌లించ‌టం.. సీరియ‌స్ కావ‌ట‌మే త‌ప్పించి.. ప్రోటోకాల్‌ ను ప‌క్క‌న పెట్టి ఇష్టారాజ్యంగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తారంటూ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టంతో మంత్రుల్ని లెక్క చేసే ప‌రిస్థితుల్లో అధికారులు లేర‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును స‌మ‌ర్థిస్తున్నారు. ఏపీలో మంత్రుల ప‌రిస్థితి ఇలా ఉంటే తెలంగాణ‌లో ఎమ్మెల్యే మీద కూడా ఈగ వాల‌ని రీతిలో ముఖ్య‌మంత్రి వ్య‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు.

ఏ అధికారి అయినా త‌మ వాళ్ల మాట విన‌ని సంద‌ర్భంలో స‌మ‌యం చూసుకొని మ‌రీ వేటు వేస్తున్నార‌ని.. ఇటీవ‌ల జ‌రిగిన ఐఏఎస్ బ‌దిలీలే అందుకు నిద‌ర్శ‌నమంటున్నారు. తెలంగాణ‌లో ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఏపీలో అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఉందంటున్నారు. ఎమ్మెల్యేల విష‌యంలో కాస్త తేడా చేసిన ఐఏఎస్ అధికారిపైనా కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని..కొన్నిసంద‌ర్భాల్లో ఎమ్మెల్యే త‌ప్పు చేసినా.. వారికి త‌న ద‌న్ను ఉంద‌న్న సందేశాన్ని తాజా బ‌దిలీల్లో స్ప‌ష్టం చేశార‌ని.. కానీ ఏపీలో మంత్రుల విష‌యంలో అధికారులు త‌ప్పులు చేస్తున్నా ప‌ట్టించుకోవ‌టం లేదంటున్నారు. ఇదే తీరులో సాగితే.. అధికారులు ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌గా మారుతుంద‌ని.. పాల‌న విష‌యంలో ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. పార్టీకి.. ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు ఖాయ‌మ‌ని తెలుగు త‌మ్ముళ్లు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. మ‌రి.. త‌మ్ముళ్ల ఆవేద‌నను  బాబు ఎప్ప‌టికి అర్థం చేసుకుంటారో?