Begin typing your search above and press return to search.
పిల్లలతో నయీం వికార చేష్టలు
By: Tupaki Desk | 13 Aug 2016 12:06 PM ISTగ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ అనంతరం చాలానే విషయాలు బయటకు వస్తున్నాయి. అతగాడి ఆరాచకాల్ని పేజీలకు పేజీలు అచ్చేస్తున్న మీడియా సంస్థలు.. ఎన్ కౌంటర్ ముందు వరకూ ఏం చేశారన్నది ఒక ప్రశ్న. నయీం కారణంగా నష్టపోయిన బాధితులు పెద్ద ఎత్తున సిట్ అధికారుల్ని సంప్రదిస్తూ.. అతడి ఆరాచకాల గురించి చెప్పుకుంటున్నారు. వారి వేదనను మీడియా సైతం వార్తల రూపంలో అందిస్తోంది. అయితే.. ఇదంతా ఎన్ కౌంటర్ తర్వాతే తప్పించి ముందు కాదన్న విషయాన్ని మర్చపోకూడదు. అది భూదందా.. సెటిల్ మెంట్లు.. అతడి చరిత్రను తవ్వి తీస్తున్న మీడియా ఇప్పటివరకూ మౌనంగా ఉందన్న ప్రశ్న ఎదురవుతుంది. అయితే.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాని దుస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా నయీంకున్న ఒక దరిద్రమైన అలవాటుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. నయీం ఎన్ కౌంటర్ తర్వాత.. అతడి నివాసంలో కొంతమంది పిల్లల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని స్టేట్ హోంకు తరలించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ ఇంట్లో అంతమంది పిల్లలు ఎందుకు ఉన్నారన్న సందేహం కలిగిన పోలీసులు... ఆ దిశగా విచారణ జరిపితే షాక్ తినే విషయాలు బయటకువచ్చినట్లుగా చెబుతున్నారు.
నరహంతకుడైన నయీంలో వికారమైన కోణం ఉందని.. అతడు పిల్లలతో చెయ్యరాని పాడు పనులు చేయించేవాడని.. వారిని లైంగికంగా హింసేంచేవాడని.. మాట వినని వారిని హింసించేవాడన్న బయటకు వచ్చింది. తానుచెప్పినట్లు చేయటానికి అంగీకరించని పిల్లలకు మత్తు మాత్రలు ఇచ్చేవాడని.. మోతాడు మించిన మత్తుమాత్రలు ఇచ్చి తనకు నచ్చినట్లు చేసేవాడని చెబుతున్నారు. ఇలా ఇచ్చే క్రమంలో ఒక చిన్నారికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని.. వైద్యం కోసమని బయటకు తీసుకెళ్లినా.. ఆ తర్వాత ఆ చిన్నారి మళ్లీ రాలేదని చెబుతున్నారు. ఇప్పటివరకూ నయీంలో భూదందాలు.. హత్యల కోణం మాత్రమే బయటకు వచ్చాయి. తాజాగా బయటకు వచ్చిన పిల్లల కోణం పలువురిని తీవ్రంగా కలిచివేస్తోంది.