Begin typing your search above and press return to search.
వేదమంత్రాలు.. విందు భోజనాలు.. పెంపుడు కుక్కల పెళ్లి.. ఇదో వింత!
By: Tupaki Desk | 23 Jun 2022 9:44 AM ISTమన దేశంలో వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. వేదమంత్రాలు, మేళతాళాల మధ్య అట్టహాసంగా పెళ్లిళ్లు జరుగుతాయి. బిహార్లోని మోతిహరిలో కూడా ఎంతో వైభవంగా ఓ పెళ్లి జరిగింది. కానీ అదో విచిత్ర పెళ్లి. ఎందుకంటే ఆ వివాహం జరిగింది రెండు పెంపుడు కుక్కలకు.
వరుడు పేరు కొల్హు కొత్త వస్త్రాలు కట్టుకుని టోపీ పెట్టుకుని రాగా.. వధువు వాసంతి కొత్త బట్టలతో పెళ్లి పందిట్లోకి విచ్చేసింది. వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లిపందిరి కింద వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది.
రకరకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేసి అతిథులకు వడ్డించారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ పెళ్లి జరిగింది మనుషులకు కాదు! ఓ రెండు పెంపుడు కుక్కలకు. మరి ఆ కథేంటంటే..
బిహార్ తూర్పు చంపారణ్లోని మోతిహరిలో ఓ అరుదైన వివాహం జరిగింది. మజుర్హాన్ గ్రామానికి చెందిన నరేశ్ సాహ్నీ, సవిత దేవి దంపతులు వారు పెంచుకుంటున్న కుక్కలకు ఘనంగా వివాహం చేశారు.
హిందూ సంప్రదాయ ప్రకారం ఈ వివాహానికి పందిరి వేసి అంగరంగ వైభవంగా చేశారు. పండితులు వేదమంత్రాలు చదువుతుండగా.. సహాయకులతో కలిసి వేడుకను నిర్వహించారు.
వివాహం అనంతరం వధూవరులను గ్రామమంతా ఊరేగింపుగా తిప్పారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లికి నాలుగు వందల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. పెళ్లికి వచ్చిన అతిథులకు రకరకాల వంటకాలతో భోజనాలు సైతం సిద్ధం చేశారు. వేడుకకు వచ్చిన అతిథులు వధూవరులను ఆశీర్వదించి భోజనం చేసి వెళ్లారు. ఇలాంటి పెళ్లి ఇప్పటివరకు తామెప్పుడూ చూడలేదని గ్రామస్థులు అంటున్నారు.