Begin typing your search above and press return to search.
ఆపరేషన్ ధియేటర్లో గొడవ-శిశువు మృతి
By: Tupaki Desk | 30 Aug 2017 12:53 PM ISTమన సంప్రదాయంలో వైద్యో నారాయణో హరిః అన్నారు. అంటే మనిషి ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. కానీ అలాంటి వైద్యులే తమపై ఉన్న గురుతర బాధ్యత మరిచిపోయి.. ఏకంగా ఆపరేషన్ థియేటర్ లోనే గొడవపడ్డారు. ఎక్కడున్నామో - ఏం చేస్తున్నామనే స్పృహ లేకుండా ప్రవర్తించారు. ప్రసవ వేదన పడుతున్న నిండు గర్భిణీని ఆపరేషన్ బెడ్ మీద వదిలేసి.. బాహాబాహీకి దిగారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో చోటుచేసుకుంది.
ఓ నిండు గర్భిణీ కడుపు నొప్పితో జోధ్ పూర్ ఉమైద్ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్న సమయంలోనే ఇద్దరు వైద్యులు డెలివరీని ఆపేసి.. ఏకంగా ఆపరేషన్ థియేటర్ లోనే గొడవపడ్డారు. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగా బాధిత మహిళ ప్రసవించిన పసికందు మృతిచెందింది. దీంతో ఆస్పత్రి తీరుపై - వైద్యుల నిర్లక్ష్యంపై బాధిత మహిళ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో ఆపరేషన్ ధియేటర్ లోనే గొడవకు దిగిన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించినట్టు ఉమైద్ ఆస్పత్రి సూపరింటిండెంట్ ఆల్ భట్ తెలిపారు. ఇద్దరు వైద్యులపై త్వరలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కడుపులో నొప్పితో - లో హార్ట్ బీట్ తో మహిళ ఆస్పత్రిలో చేరిందని, అయినా నవజాత శిశువు మృతిపై దర్యాప్తు జరుపుతామని భట్ పేర్కొన్నారు.