Begin typing your search above and press return to search.

చంద్రబాబును జనాలు నమ్ముతారా ?

By:  Tupaki Desk   |   22 Sep 2021 9:33 AM GMT
చంద్రబాబును జనాలు నమ్ముతారా ?
X
తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే పేదల గృహణాలను పూర్తిగా రద్దుచేస్తాము’.. ఇది చంద్రబాబునాయుడు ఇచ్చిన తాజా హామీ. రుణాలరద్దు అంటె అందరికీ ముందు చంద్రబాబే గుర్తుకొస్తారు. 2014 ఎన్నికల్లో రైతురుణాలు, డ్వాక్రారుణాలు+చేనేత రుణాల రద్దంటు ఇచ్చిన హామీ అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో రైతురుణాల మొత్తం దాదాపు రు. 87 వేల కోట్లు. ఇదికాకుండా డ్వాక్రా, చేనేతల రుణాలు వేరే ఉన్నాయి.

అసలే లోటుబడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాంలో రైతురుణ మాఫీ ఎలా చేస్తారని చాలామంది ప్రశ్నించారు. అయితే చంద్రబాబు అండ్ కో దీనికి సమాధానంగా తమ దగ్గర ప్లాన్ ఉందని అధికారంలోకి వస్తేకానీ చెప్పమని చెప్పారు. దాంతో జనాలు నిజమే అనుకుని నమ్మి టీడీపీకి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా లెక్కలేసి రైతురుణమాఫీని రు. 27 వేల కోట్లకు కుదించేశారు. అదేమిటంటే తాము ఇంతే చేస్తామన్నారు.

రైతురుణమాఫీని ఇలా చేసిన ప్రభుత్వం డ్వాక్రా, చేనేతల రుణమాఫీలు ఎలా చేసిందో అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల సమయానికి ఒకసారి తాము రైతురుణాలన్నింటినీ మాఫీ చేసేసేనట్లు బారీ ప్రచారం చేసుకుంది. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాము చేయలేక వదిలేసిన రెండు వాయిదాల రుణమాఫీని జగన్మోహన్ రెడ్డి మాఫీ చేయాలంటు ఎన్నిసార్లు చంద్రబాబు అండ్ కో డిమాండ్ చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది.

సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇపుడు రుణమాఫీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. పేదలు తీసుకున్న గృహరుణాలను మాఫీ చేస్తారట. అధికారంలోకి రావటానికి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎలా తుంగలో తొక్కారో అందరు చూసిందే. ఆ హామీలు, వాటి అమలును చూసిన తర్వాతే జనాలు టీడీపీని ఘోరంగా ఓడించేశారు. తాము అధికారంలో ఉన్నపుడు హామీల అమలు విషయంలో ఎలా వ్యవహరించింది బహుశా చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

కానీ చంద్రబాబు నైజాన్ని జనాలు ఎలా మరచిపోతారు ? అలాంటిది గృహరుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని జనాలు నమ్ముతారని ఎలాగ అనుకున్నారో అర్ధం కావటంలేదు. ఎవరైనా ఒకసారి మోసపోతారు కానీ పదే పదే మోసపోతారా ? కానీ జనాలు అలాగే మోసపోతారని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమకిచ్చిన హామీలను తుంగలో తొక్కితే చంద్రబాబునే కాదు జనాలు జగన్ను అయినా అధికారంలో నుండి దింపేయటం ఖాయం.