Begin typing your search above and press return to search.

బాబు చ‌ర్య‌లు మొత్తానికే మోసం చేస్తాయా? టీడీపీలో చర్చ

By:  Tupaki Desk   |   7 Jan 2022 7:00 AM IST
బాబు చ‌ర్య‌లు మొత్తానికే మోసం చేస్తాయా?  టీడీపీలో చర్చ
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే. ఈ మాట పార్టీలోని అన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తోం ది. అయితే.. దీనికి సంబంధించి పార్టీ అధినేత చేస్తున్న వ్యాఖ్య‌లు.. జారీ చేస్తున్న హెచ్చ‌రిక‌లు.. ఏమేర‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చుతాయ‌నే చ‌ర్చ‌సాగుతోంది. కొండ నాలిక‌కు మందేస్తే.. అన్న‌ట్టుగా మారితే.. చంద్ర‌బా బుకు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు.

దీనికి కార‌ణం.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని న‌డిపించే ప్ర‌తి ఒక్క‌రినీ ఆయ‌న అనుమానిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డ‌మే. నిజానికి పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల్సి వ‌స్తే.. అది సీనియ‌ర్ల నుంచే జ‌ర‌గాలి. ఎందుకంటే.. ప‌ద‌వుల కోసం ఆరాట ప‌డుతున్న‌ది.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని వీక్ చేస్తున్న‌ది కూడా వారేన‌నే భావన ఆది నుంచి వినిపిస్తోంది.

అదేస‌మ‌యంలో పార్టీకోసం క‌ష్టించే వారికి ప్రాధాన్యం విష‌యంలోనూ చంద్ర‌బాబు ఏం చేస్తారో.. అనే భావ‌న కూడా నేత‌ల‌ను వెంటాడుతూనే ఉంది. ఇంత జ‌రుగుతున్నా..నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరికి టికెట్లు ఇస్తాను.. అని ఆయ‌న చెప్ప‌లేక‌పోతున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది. పోనీ .. చంద్ర‌బాబు ఊహిస్తున్న‌ట్టుగా.. ముంద‌స్తు వ‌చ్చినా.. అది కూడా ఏడాది ప‌డుతుంది.

ఇప్ప‌టికిప్పుడు ఏమీ జ‌రిగిపోదు. కానీ, చంద్ర‌బాబు చేస్తున్న హెచ్చ‌రిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. మాత్రం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చేసిన చందంగానే ఉన్నాయి. అయితే.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకోవాలంటే.. కొంద‌రిని పిలిచి మాట్లాడితే స‌రిపోతుంద‌ని.. ఆ కొంద‌రి వంక పెట్టి అంద‌రినీ విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని అంటున్నారు.

చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఒక‌విధంగా ఉంటార‌ని.. అధికారంలోకి వ‌స్తే.. మ‌రో విధంగా ఉంటా ర‌నే ప్ర‌చారం పార్టీలోనే ఉంది. ముందు దీనిని చెరిపేసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఇప్ప‌టికిప్పుడు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు నేత‌ల‌నుప్ర‌క‌టించ‌డం ద్వారా.. ఆయ‌న ఈ అప‌వాదునుచెరిపేసుకునే ప్ర‌య‌త్నం చేయొచ్చు.

కానీ, అలా సాధ్యం అయ్యే ప‌రిస్తితి క‌నిపించ‌డం లేదు. వార‌సుల‌కే మ‌ళ్లీ టికెట్లు ఇచ్చే వ్యూహం తెర‌వెనుక జ‌రుగుతోందనేది టీడీపీలోని ఓ వ‌ర్గం నేత‌లు తెర‌చాటు చెబుతున్న మాట‌. ఈ వ‌రుస‌లో చాలా మంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు.. నేత‌ల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం వెనుక ఉన్న వ్యూహం కూడా ఇదేన‌ని అంటున్నారు.

నిజానికి గ‌త ఎన్నిక‌ల్లోనే వార‌సుల‌కు టికెట్లు భారీగా ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు ఈ పొర‌పాటును దిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ఎక్క‌డా చంద్ర‌బాబు సంకేతాలు పంప‌లేక పోతున్నారు.

తాజాగా ఇంచార్జుల మీటింగ్ జ‌రిగింది. దీనిలోనూసీనియ‌ర్ల‌యిన య‌న‌మ‌ల‌, సోమిరెడ్డి వంటివారికే మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌డాన్ని జూనియ‌ర్లు త‌ప్పుబ‌డుతున్నారు. త‌మ‌కు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి క‌దా? అనేది వారి ప్ర‌శ్న‌. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కొండ నాలుక‌కు చంద్ర‌బాబు వేస్తున్న మందు.. ఉన్న‌నాలిక‌ను ఊడ‌గొట్టేందుకు మార్గం సుగ‌మం చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపించేలా చేస్తోంది.