Begin typing your search above and press return to search.

జిల్లాకో ఇంచార్జ్‌.. బ‌స్సు యాత్ర‌.. వైసీపీ కౌంట‌ర్ ఎటాక్‌..!

By:  Tupaki Desk   |   23 Jan 2023 9:44 AM GMT
జిల్లాకో ఇంచార్జ్‌.. బ‌స్సు యాత్ర‌.. వైసీపీ కౌంట‌ర్ ఎటాక్‌..!
X
రాష్ట్రంలో రాజ‌కీయాల వేడి పెరిగింది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు దూకుడుగా ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన పార్టీలు క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఇంటికి పంపించే వ‌ర‌కు నిద్ర పోని రీతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ యువ‌గ‌ళం పేరుతో యువ నేత‌, నారా లోకేష్‌ను రంగంలోకి దింపుతోంది. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా.. రంగంలోకి దిగుతున్నారు.

ఇక‌, మ‌రోవైపు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి వెప‌న్‌ను దూస్తున్నారు. ఆయ‌న కూడా బ‌స్సు యాత్ర‌ను ప్రారంభిస్తున్నారు. ఇలా.. అటు ప‌వ‌న్‌.. ఇటు నారా లోకేష్‌.. మ‌రోవైపు చంద్ర‌బాబుల దూకుడు తో పార్టీల దూకుడు పెరిగింది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి ఉన్న సానుభూతిని ప‌టాపంచ‌లు చేయ‌డంతో పాటు.. వైసీపీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ అలెర్ట్ అయ్యార‌ని స‌మాచారం.

ఒక‌వైపు నారా లోకేష్‌, మ‌రో వైపు ప‌వ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు పెంచితే.. ఇప్పుడు జ‌గ‌న్ రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాను టార్గెట్ చేసుకుంటున్నారు. జిల్లాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు క‌దిలి పోకుండా.. ఉండేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే జిల్లాల్లో యాత్ర‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలుచెబుతున్నాయి.

అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ఆరు లేదా నాలుగు మాసాల ముందు గానే సీఎం జ‌గ‌న్‌ కూడా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతోపాటు.. ప్ర‌తిప‌క్షాలే టార్గెట్‌గా ఆయ‌న మ‌రోసారి.. యాత్ర‌కు సిద్ధం కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్రాథ‌మికంగా తెలుస్తోంది.

ఇదే జ‌రిగితే.. టీడీపీ,జ‌న‌సేన చేయ‌నున్న యాత్ర‌ల‌కు కౌంట‌ర్ ఎటాక్ చేసిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.