Begin typing your search above and press return to search.
ఈ ఇద్దరు నేతల వారసులకు చంద్రబాబు సీట్లు ఖరారు చేసినట్టేనా?
By: Tupaki Desk | 6 Feb 2023 8:00 AM GMTఏపీలో 'తూర్పు' గాలి ఏ పార్టీ వైపు వీస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని నానుడి. ఈ నేపథ్యంలో ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే అత్యధిక ఎమ్మెల్యే సీట్లు సాధిస్తుందో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే ఇది పలుమార్లు నిరూపణ అయ్యింది.
ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల వారసులకు చంద్రబాబు దాదాపు సీట్లు ఖరారు చేశారు. తాజాగా కొన్ని నియోజకవర్గాలకు చంద్రబాబు ఇంచార్జిలను నియమించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథుర్ ను ఇంచార్జిగా నియమించారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంటి హరీష్ మాథుర్ పి.గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు.
2019 ఎన్నికల్లో గంటి హరీష్ మాథుర్ అమలాపురం నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చింతా అనురాధ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి అమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు జీవీ శ్రీరాజ్ పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇటీవల జీవీ శ్రీరాజ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలసిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అమలాపురం ఎంపీ సీటు కోసమే జీవీ శ్రీరాజ్ చంద్రబాబును కలసినట్టు ప్రచారం జరిగింది. గతంలో హర్షకుమార్ సైతం చంద్రబాబు కాళ్లకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇది వివాదాస్పదమైంది. పలు దళిత సంఘాలు హర్షకుమార్ పై మండిపడ్డాయి.
కాగా అమలాపురం నుంచి లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున జీఎంసీ బాలయోగి 1991, 1998, 1999ల్లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అటల్ బిహారి వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. 2002లో ఒక హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి కన్నుమూశారు. దీంతో 2002లో బాలయోగి భార్య గంటి విజయకుమారి ఉప ఎన్నికలో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.
ఇక హర్షకుమార్ 2004, 2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి హర్షకుమార్ ఓటమిపాలయ్యారు. 2019లో ఆయన పోటీ చేయలేదు.
ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో మాల సామాజికవర్గంలో గట్టి పట్టున్న జీఎంసీ బాలయోగి, జీవీ హర్షకుమార్ కుటుంబాలకు చంద్రబాబు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.
పి.గన్నవరంకు అధికారికంగా బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ ను ఇంచార్జిగా ప్రకటించిన చంద్రబాబు మరికొద్ది రోజుల్లో అమలాపురం పార్లమెంటరీ స్థానానికి జీవీ హర్షకుమార్ కుమారుడు జీవీ శ్రీరాజ్ ను అభ్యర్థిగా ప్రకటిస్తారని సమాచారం. తద్వారా కోస్తా జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మాల సామాజికవర్గాన్ని ఆకట్టుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.