Begin typing your search above and press return to search.

రెడ్డి వ‌ర్గంపై బాబు వ్యూహం ఫ‌లించ‌లేదా...?

By:  Tupaki Desk   |   30 Nov 2021 3:59 AM GMT
రెడ్డి వ‌ర్గంపై బాబు వ్యూహం ఫ‌లించ‌లేదా...?
X
ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డాల‌ని.. సీఎంగా జ‌గ‌న్ పీఠం అధిరోహించాల‌ని.. కోరుకున్న‌ది ఎవ రు..? అంటే.. త‌డుముకోకుండా. అంద‌రూ చెప్పేమాట‌..రెడ్డి సామాజిక‌వర్గం. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి అన్యాయం జ‌రిగింద‌ని.. ఎలాంటి గుర్తింపు లేద‌ని.. భావించ‌డం వ‌ల్లే.. రెడ్డి వ‌ర్గం.. జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించింద‌న్న‌ది.. నిష్టుర స‌త్యం. అయితే.. రెండున్న రేళ్లు అయి న‌ప్ప‌టికీ.. రెడ్డి వ‌ర్గానికి జ‌గ‌న్ ఏమీ చేయ‌లేద‌న్న‌ది ఇప్పుడు అదే వర్గంలో వినిపిస్తున్న మాట‌.

దీంతో రెండున్న‌రేళ్ల‌యినా.. ఒక్క రూపాయిని తాము సంపాయించుకోలేక పోయామ‌ని.. ఈ వ‌ర్గం ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. అదేస‌మ‌యంలో.. ప‌ద‌వుల విష‌యంలోనూ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ అంటూ.. త‌మ‌కు ద‌క్క కుండా పంచేస్తు న్నారని.. జ‌గ‌న్‌ను ఎంతో ఆరాధించే నాయ‌కులు కూడా గుస్సాగా ఉన్నారు.

ముఖ్యంగా నెల్లూరు వంటి రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న జిల్లాలోనే నాయ‌కులు ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో.. ఈ వ‌ర్గాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని.. చంద్ర‌బాబుకొన్నాళ్లుగా భావిస్తున్నారు.

త‌ద్వారా.. వైసీపీని ఇరుకున పెట్టాల‌ని అనుకుంటున్నార‌ని.. వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఏవిధంగా అయితే.. వైసీపీలోని క‌మ్మ నేత‌లు.. టీడీపీకి కంట్లో న‌లుసుల్లా మారారో.. అదేవిధంగా టీడీపీలోనూ రెడ్డి వర్గాన్ని వైసీపీకి న‌లుసుల్లా త‌యారు చేయాల‌ని అనుకున్నారు.

తొలుత ఈ వ్యూహాన్ని నెల్లూరు నుంచి ప్రారంభించాల‌ని భావించిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఇదే గుస‌గుస వినిపించింది. రెడ్డి వ‌ర్గం మొత్తం సైలెంట్‌గా టీడీపీకి అండ‌గా ఉంటుంద‌ని.. దీంతో ఇక్కడ కార్పొరేష‌న్ సీటు ఖాయ‌మ‌ని లెక్క‌లు వేసుకున్నారు.

తీరా చూస్తే.. కార్పొరేషన్ టికెట్‌ను వైసీపీ ద‌క్కించుకుంది. పైగా.. టీడీపీ కేవ‌లం 5వార్డుల‌నే ద‌క్కించుకుం ది. ఈ ప‌రిణామాల‌తో అవాక్క‌యిన టీడీపీ సీనియ‌ర్లు.. త‌మ ప్లాన్ పార‌లేద‌ని.. రెడ్డి వ‌ర్గం.. అసంతృప్తిలో ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీపై విశ్వాసం చూపించ‌లేక పోతోంద‌ని.. వారు అంచ‌నాలు వేసుకున్నారు. ఈ క్ర‌మంలో నే.. ఇప్పుడు.. ఏం చేయాల‌నే విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రి.. ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.