Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్రా అభివృద్ధి వైఎస్సార్ దే... మరి బాబు జగన్...?
By: Tupaki Desk | 12 Oct 2022 9:30 AM GMTఆయన జగన్ క్యాబినేట్ లో మంత్రి. ఇంటి పేరుకు తగినట్లుగా ధర్మంగా మాట్లాడుతారు అని అంటారు. అయితే ధర్మాన ఇపుడు చాలా పెద్ద ఎత్తున ఆవేశాన్ని చూపిస్తున్నారు. ఉత్తరాంధ్రా ప్రాంతాల అభివృద్ధి అంటూ వకాల్తా పుచ్చుకుంటున్నారు. ధర్మాన సబ్జెక్ట్ బాగా స్టాడీ చేసి మాట్లాడుతారు అని పేరు. అయితే ఆయన వైసీపీ మంత్రిగా ఉండి ఉత్తరాంధ్రా వెనకబాటుతనానికి చంద్రబాబు కారణం అంటున్నారు. ప్రత్యర్ధి పక్షం కాబట్టి అలా ధర్మాన అలా నిందించవచ్చు అనుకున్నా అసలు ఉత్తరాంధ్రాకు జవజీవాలు వచ్చిందే వైఎస్సార్ ఏలుబడిలో అంటున్నారు.
అంటే జగన్ పాలనలో కూడా ఉత్తరాంధ్రాకు ఏమీ చేయలేదని మంత్రి గారు చెప్పదలచారా అన్నదే ఇపుడు చర్చ. పైగా జగన్ మూడేళ్ల కాలంలో ఉత్తరాంధ్రా అభివృద్ధి చెందలేదు అంటున్నారు, బాబు పద్నాలుగేళ్ళు సీఎం గా చేసి ఏమి ఉద్ధరించారు అని ధర్మాన నిలదీస్తున్నారు. అంటే బాబు 14 ఏళ్లు అయినా జగన్ మూడేళ్ళు అయినా ఉత్తరాంధ్రాకు ఏమీ చేయేలేదని చెప్పకనే చెప్పడమేనా పెద్దాయన ఉద్దేశ్యం అన్నదే లాజిక్ పాయింట్ మరి.
కేంద్రం నియమించిన రాజ్యాంగబద్ధ కమిటీగా శివరామక్రిష్ణ కమిటీ ఉండగా దాన్ని కాదని తన సొంత మనుషులతో చంద్రబాబు రాజధాని విషయంలో ఎందుకు నియమించారు. ఆ కమిటీ సిఫార్సులను ఎలా ఆమోదిస్తారు అని ధర్మాన ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు చంద్రబాబు దీని జవాబు చెప్పి తీరాలని కూడా ఆయన గద్దిస్తున్నారు.
ఎంతసేపూ ఉత్తరాంధ్రా జనాలు నష్టపోవాలా. వారు కష్టాలు పడాలా అభివృద్ధి అసమానతలు కొనసాగాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో చిత్రమైన మాట కూడా ధర్మాన అంటున్నారు.ఉత్తరాంధ్రాకు ఇప్పటిదాకా వచ్చిన అభివృద్ధి కానీ పెట్టిన సంస్థలు కానీ ఇతర ప్రాంతాల వారివట. అభివృద్ధి చెందిన ప్రాంతాల వారే ఇక్కడ సంస్థలు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రా నుంచి ఎవరూ అంత మోతుబతులు లేరని ఆయన అంటున్నారు. మరి రేపటి రోజున రాజధాని విశాఖకు వచ్చినా కూడా ఇతర ప్రాంతాల వారి పెత్తనమే ఉంటుంది కదా.
అందరూ వచ్చి అభివృద్ధి చేస్తేనే కదా ఉత్తరాంధ్రా ముందుకు సాగేది. మరి దీనికి ధర్మాన ఏమని చెబుతారో. లేక రాజధాని ఇలా వచ్చాక అలా ఉత్తరాంధ్రా వాసులంతా పారిశ్రామికవేత్తలు అవుతారు అని ఆయన నమ్మకమా అని అడుగుతున్న వారున్నారు. శ్రీకాకుళం జిల్లా 2004 వరకూ టీడీపీకి కంచుకోట అని చంద్రబాబు తన విధానాలతో దాన్ని పాడుచేశారని ధర్మాన టీడీపీ గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
మొత్తానికి విశాఖకు రాజధాని రావాల్సిందే అని ఆయన నొక్కి చెబుతున్నారు. రాజధాని నడిబొడ్డున ఉండాలని ఎక్కడా లేదని చెన్నై, హైదరాబాద్ లను ఆయన ఉదహరిస్తున్నారు. అంతా విశాఖ రాజధాని కోసం సహకరించాలని కోరుతున్నారు. మరి ధర్మనా ధర్మంగా చెప్పారా. లేక ఆయన ఘాటు విమర్శలు సొంత పార్టీకి తగిలాయా. టీడీపీకి మంచి చెప్పారా లేక సెటైర్లు వేశారా. ఏమో ఎవరికి తోచిన తీరున వారు అర్ధం చేసుకోవాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.