Begin typing your search above and press return to search.
అప్పుల లెక్క తేల్చాల్సిందే
By: Tupaki Desk | 7 March 2023 12:00 PM GMTరాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పెంత ఉందో లెక్క తేల్చమని కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సర్క్యులర్ అందింది. రాష్ట్రం మొత్తం అప్పులపై లెక్కలు చెప్పాలని రాజ్యసభలో ఒక ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రం మీదుంది. అందుకనే రాష్ట్రంలోని వాస్తవ అప్పులు ఎంతున్నాయనే లెక్కలను పూర్తిగా పంపించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2014-19 మధ్యలో చేసిన అప్పులెంత, 2019 నుండి 2023 ఫిబ్రవరి వరకు చేసిన అప్పు ఎంత అన్నది సంవత్సరాల వారీగా చెప్పాలని కేంద్రం ఆదేశించింది.
జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు పెరిగిపోయాయని చంద్రబాబునాయుడు అండ్ కో పదేపదే ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల లెక్కలతో జగన్ అండ్ కో ఎదురుదాడి చేస్తున్నారు.
వీళ్ళ మధ్య గొడవల్లో రాష్ట్రం చేసిన అసలు అప్పు ఎంతన్న వాస్తవ లెక్కలు జనాలకు తెలీటం లేదు. మధ్యలో ఒకటి రెండుసార్లు రాష్ట్ర అప్పులపై కేంద్రం పార్లమెంటులో ప్రకటించినా దానిపైన కూడా వివాదాలున్నాయి.
అందుకనే 2014 నుండి సంవత్సరాల వారీగా అప్పుల లెక్కలు చెప్పాలని కేంద్రం అడిగింది. పైగా బ్యాంకుల నుండి వివిధ శాఖలు తీసుకున్న అప్పులు, నేరుగా ప్రభుత్వమే చేసిన అప్పుల వివరాలు చెప్పాలని అడిగింది. అలాగే వివిధ ఆర్ధికసంస్ధల నుండి తీసుకున్న అప్పుల లెక్కలు కూడా చెప్పాల్సిందే అని ప్రత్యేకంగా అడిగింది. ఇపుడు జగన్ ప్రభుత్వం ఎలాగైతే అప్పులు చేస్తోందో గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే పద్దతిలో అప్పులు చేసింది.
మరిపుడు కేంద్రం నుండి వచ్చిన సర్క్యులర్ కు రాష్ట్రప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందో అందులో ఏముంటుందనేది ఆసక్తిగా మారింది. నిజానికి బడ్జెట్ కేటాయింపులతోను, ప్రభుత్వం చేస్తున్న అప్పులపైన మామూలు జనాలకు ఎలాంటి ఆసక్తి ఉండదు.
జనాలకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి జరుగుతోందా ? పథకాలు అమలవుతున్నాయా అన్నది మాత్రమే జనాలు చూసుకుంటారు. ఈ అప్పులు, తిప్పలన్నీ రాజకీయంగా ఒకళ్ళపై మరొకళ్ళు బురద చల్లుకోవటానికి మాత్రమే పనికొస్తుందంతే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.