Begin typing your search above and press return to search.
ఉమ్మడి కుటుంబంలో 21మందికి పాజిటివ్ .. ఆ ఒక్కరివల్లే ?
By: Tupaki Desk | 26 March 2021 9:59 AM ISTనిన్న మొన్నటి వరకు ఏపీలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు కొంచెం కంట్రోల్ లోనే ఉండేవి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యేవి. కానీ, కరోనా వైరస్ కేసులు ప్రస్తుతం శరవేగంగా పెరిగిపోతుండటంతో అందరిని ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తూ ఎంతోమందికి పాకిపోతోంది. దీంతో ఇక కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో భయపడినట్లు గానే ప్రస్తుతం ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కరోనా వైరస్ ప్రభావం తగ్గింది వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది అని అటు ప్రజలందరూ ఎంతో సంతోష పడుతున్న తరుణంలో ఇక ఇప్పుడు మరో సారి వైరస్ విజృంభించడంతో అందరిలో ఆందోళన మొదలైంది.
చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రస్తుతం ఎంతోమంది వైరస్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తీసుకొస్తుంది. కాగా ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం లోని ఒక ఇంట్లో ఇటీవల ఏకంగా 21 మందికి కరోనా వైరస్ కు రావడం స్థానికులు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఒక విద్యార్థి చేసిన చిన్న పాటి పొరపాటు కారణంగా చివరికి ఆ కుటుంబంలో 21 మంది కరోనా వైరస్ బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విద్యార్థి రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. ప్రస్తుతం ఈ 21మందికి సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇంతమందికి వైరస్ సోకడంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అధికారులు ఆ కుటుంబసభ్యులకు చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఏపీలో గత 24 గంటల్లో 35,196 శాంపిళ్లను పరీక్షించగా.. 758 మందికి పాజిటివ్‌గా తేలిందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 175 కొత్త కేసులు నమోదు కాగా.. గుంటూరు జిల్లాలో 127, విశాఖపట్నం 98, కృష్ణా 80 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ డబుల్ డిజిట్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 647 యాక్టివ్ కేసులు ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో 516 యాక్టివ్ కేసులున్నాయి.