Begin typing your search above and press return to search.
హైదరాబాదీయులకు దడ పుట్టే విషయం బయటకొచ్చింది
By: Tupaki Desk | 13 March 2020 11:30 AM ISTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుణ్యమా అని.. గడిచిన పది రోజులుగా హైదరాబాదీయుల లైఫ్ స్టైల్లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. నాన్ వెజ్ ను లొట్టలేసుకుంటే తినే సగటు హైదరాబాదీలకు భిన్నంగా.. నాన్ వెజ్ అన్నది ఆచితూచి అన్నట్లుగా తింటున్న పరిస్థితి. హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ప్రతి అంశంలోనూ కరోనా భయం హైదరాబాదీయుల్ని వెంటాడుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా హైదరాబాద్ లో మరణించిన 70 ఏళ్ల కర్ణాటక వాసి మరణం.. హైదరాబాదీయులకు కొత్త బెంగను తెచ్చి పెట్టిందని చెప్పాలి. 70 ఏళ్ల కర్ణాటక వాసి హైదరాబాద్ లో మరణించటం ఒక ఎత్తు అయితే.. సదరు పెద్దమనిషికి కరోనా వైరస్ సోకి ఉందన్న సందేహం ఉంది. అయితే.. ఈ విషయం తాజాగా కన్ఫర్మ్ అయింది. దీనికి.. హైదరాబాదీయుల గుండెల్లో దడ పుట్టటానికి లింకేముంది? అన్న ప్రశ్నను సంధించే అవకాశం ఉంది.
అక్కడికే వస్తున్నాం. హైదరాబాద్ లో మరణించిన పెద్ద మనిషికి కరోనా పాజిటివ్ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించటం ఒక ఎత్తు అయితే.. అతగాడి మరణం తర్వాత.. తనకు ఎదురైన అనారోగ్యానికి చికిత్స కోసం హైదరాబాద్ లోని దాదాపు మూడు.. నాలుగు కార్పొరేట్ ఆసుపత్రుల్ని సందర్శించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. తనకు ఎదురైన అనారోగ్యానికి చికిత్స కోసం హైదరాబాద్ మహా నగరంలోని కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లినట్లుగా సమాచారం.
తాజాగా ఆయన మరణం నేపథ్యంలో.. ఆయన ఎక్కడెక్కడ.. ఎవరెవరిని కలిశారు? ఆ సందర్భంలో వారు ఏమైనా కరోనా ఎఫెక్ట్ కు లోనయ్యారా? వారి పరిస్థితి ఇప్పుడెలా ఉందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కరోనా పాజిటివ్ రోగులు.. బయటకు రాకూడదు. వచ్చినా ఎవరితోనూ నేరుగా కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అలాంటిది సదరు పెద్దాయన తనకొచ్చిన కరోనా గురించి తెలీక.. పలు ఆసుపత్రులను కలిసిన నేపథ్యంలో.. ఆ సందర్భంగా ఆయనకు కాంటాక్ట్ అయిన వారి డిటైల్స్ ఇప్పుడు ఆందోళనకరంగా మారాయి. ఈ విషయం హైదరాబాదీయుల గుండెల్లో కొత్త గుబులకు కారణమవుతుందని చెప్పక తప్పదు.