Begin typing your search above and press return to search.
విజయవాడ దుర్గమ్మ గుడిలో కరోనా విజృంభణ ..
By: Tupaki Desk | 18 Aug 2020 2:20 PM ISTఏపీలో కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దానికి తోడు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా విజృంభణ మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. ఈ మధ్య రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూడా కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే విజయవాడ దుర్గ గుడిలో కీలక అధికారితో పాటు ఐదరుగురు సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా మరో ఏడుగురు సిబ్బంది కరోనా బారినపడ్డారు.
గతంలో ఒక వేదపడింతుడు, ఓ సిబ్బంది కరోనామహమ్మారి కారణంగా కన్నుమూశారు. మరో విషయం ఏమిటంటే ..కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకునేవరకు కరోనా భయటపడటం లేదు దాంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఆలయంలో రోజూ శానిటైజ్ చేసినా, మాస్క్‌లు ధరించినా కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని సిబ్బంది వాపోతున్నారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. అందుకే అధికారులు తగు జాగ్రత్తలు వహిస్తూ భక్తులకు పలు సూచనలు తెలియజేస్తున్నారు..విజయవాడ దుర్గమ్మ ఆలయం తో పాటుగా తిరుమల లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడడం తో వెంకన్న దర్శనం చేసుకునేందుకు భక్తులు భయపపడుతున్నారు. అలాగే శ్రీశైలం,అన్నవరం ఆలయాల్లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.