Begin typing your search above and press return to search.
ఆమె మెదడును చిట్లిపోయేలా చేసిన బుల్లెట్
By: Tupaki Desk | 18 Nov 2015 11:55 AM ISTమంగళవారం దారుణ హత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దుండగులు పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపటంతో ఘటనాస్థలంలోనే ఆమె కుప్పకూలిపోవటం.. ఆమె ప్రాణాలు పోవటం జరిగింది. పోస్ట్ మార్టం నివేదికలో ఆమె మరణించటానికి కారణాన్ని వైద్యులు వెల్లడించారు. దుండగలు జరిపిన కాల్పుల కారణంగా ఆమె మరణించినట్లు తేల్చారు.
దుండగలు కాల్చిన బుల్లెట్ ఆమె మెదడును చిట్లిపోయేలా చేసిందని.. ఈ కారణంతోనే ఆమె వెంటనే మరణించినట్లుగా పేర్కొన్నారు. ఇక.. ఆమెపై కత్తితో దాడికి పాల్పడినట్లుగా చెబుతున్న వాదనలు నిజం కావని వైద్యులు తేల్చారు. ఆమె శరీరం మీద ఎలాంటి కత్తి గాయాలు లేవని వెల్లడించారు. బుల్లెట్ ఆమె మెదడును దెబ్బ తీయటం వల్లనే ఆమె మరణించినట్లుగా పేర్కాన్నారు.