Begin typing your search above and press return to search.
తూళ్లూరు శాపగ్రస్థ ప్రాంతం..బాబు పతనం తప్పదు
By: Tupaki Desk | 22 July 2017 4:59 PM ISTఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీని అవినీతి రాష్ర్టంగా మార్చేస్తున్నారని... రాజధాని అమరావతిలో అవినీతి తప్ప, అభివృద్ధి లేదన్నారు. నిజానికి తూళ్లూరు ఒక శాపగ్రస్థ ప్రదేశమని.. అక్కడ అడుగుపెడితే పాలకులకు పతనం తప్పదని ఆయన అన్నారు.
చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లు పోలవరం పేరు చెప్పి కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారని ఆరోపించారు. ఒకప్పుడు చెప్పులు లేకుండా తిరిగిన చంద్రబాబుకు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని... ఇది అడ్డూ అదుపు లేకుండా సాగుతోందని ఆరోపించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మరోవైపు మోహన్ ఏపీ డీజీపీపైనా విమర్శలు కురిపించారు. ఏపీ డీజీపీ సాంబశివరావు టీడీపీ నాయకుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.