Begin typing your search above and press return to search.

నిజామాబాద్ కు బాబు.. సైకిల్ కు బాగానే రిపేర్

By:  Tupaki Desk   |   14 Jan 2023 1:30 AM GMT
నిజామాబాద్ కు బాబు.. సైకిల్ కు బాగానే రిపేర్
X
తెలంగాణలో సైకిల్ కు రిపేర్ చేసే పనిలో టీడీపీ అధినేత చంద్రబాబు బీజీ అయ్యారు. మొన్న ఖమ్మంలో తెలంగాణలో మళ్లీ విస్తరణ చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉండే నిజామాబాద్ పై దృష్టి సారించారు. టీడీపీకి కొత్త ఇన్ చార్జి వచ్చాక ఆ పార్టీలో జోష్ పెరిగింది. ప్రస్తుతం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. పార్టీలో పనిచేసేవారు ఎవరు? చేయని వారు ఎవరన్నది ఆరాతీస్తున్నారు. వ్యతిరేకత ఉన్న వారిని పక్కనపెట్టేస్తున్నారు.

ఇక సంక్రాంతి తర్వాత పార్టీ కమిటీతోపాటు అనుబంధ కమిటీలను సైతం రద్దు చేసి నూతన కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సోషల్ మీడియా కమిటీలనుసైతం నియమించనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఫెయిల్యూర్స్ పై నిరసన కార్యక్రమాలకు పార్టీ సన్నదమవుతోంది.

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పునర్వైభవం తీసుకొచ్చేందుకు పార్టీ అధినాయకత్వం వేగం పెంచింది. అందులో భాగంగానే పార్టీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. టీడీపీ రాష్ట్ర, పార్లమెంట్, అసెంబ్లీ , మండల, గ్రామ కమిటీలతోపాటు అనుబంధ సంఘ కమిటీలు ఎస్సీ, బీసీ,ఎస్టీ, గీత, టీఎన్టీయూసీ, తెలుగు మహిళ, తెలుగు యువత , తెలుగు రైతు , చేనేత, మైనార్టీ, ఐటీ విభాగం కమిటీలను రద్దు చేస్తున్నారు.

ఇప్పటికే కొన్ని కమిటీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో వాటిని భర్తీకాకుండా పూర్తిగా నూతన కమిటీ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత నూతన కమిటీలు వేసేందుకు స్పీడ్ పెంచారు.

యాక్టివ్ గా పనిచేసే వారికే కమిటీల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. పలువురు నేతలు కమిటీల్లో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారికి చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం రెడీ అయినట్టు సమాచారం.

ఇక పనితీరు ఆధారంగానే నియోజకవర్గాల వారీగా నేతలను ఎంపిక చేసి ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. టీడీపీ బలంగా ఉన్న ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ కూకట్ పల్లి వంటి ఏరియాలను టార్గెట్ చేశారు. సంక్రాంతి తర్వాత నిజామాబాద్ కు చంద్రబాబు వెళుతున్నారు. అక్కడ ఉన్న ఆంధ్రులతో కలిసి నేతల తో కలిసి పార్టీని బలోపేతం చేయనున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.