Begin typing your search above and press return to search.

బాబు షాకింగ్ డెసిషన్.. ఇక నో ఎంట్రీ... ?

By:  Tupaki Desk   |   26 Nov 2021 7:00 PM IST
బాబు షాకింగ్ డెసిషన్.. ఇక నో ఎంట్రీ... ?
X
చంద్రబాబు అంటే నిన్నటి దాకా ఒక లెక్క. ఇపుడు వేరే లెవెల్ అంటున్నారు. ఆయనే స్వయంగా ఈ విషయం చెప్పుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులోని కొందరు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పార్టీలో చేరిన సందర్భంగా బాబు మాట్లాడుతూ ఇక మీదట టీడీపీలో వలస పక్షులకు చోటు లేదేని కచ్చితమైన మాట చెప్పేశారు.

అంటే క్లియర్ గా చెప్పాలంటంటే జంపింగ్ జఫాంగులకు నో ఎంట్రీ అని టీడీపీ ఆఫీస్ ఎదుట బోర్డు పెట్టేస్తున్నట్లు అన్న మాట. టీడీపీలో ఈ రకంగా చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకోవడం అంటే షాకింగ్ గానే చూడాలి.

ఎందుకంటే ఏ పార్టీ వారైనా సులువుగా టీడీపీలో చేరిపోతూంటారు. అంతవరకూ ఎందుకు టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు వదిలేసి తిరిగి టీడీపీకి మంచి రోజులు ఉన్నాయని సంకేతాలు వస్తే చాలు ఎగిరి గంతేసుకుంటూ వచ్చేవారికి ఇన్నాళ్ళూ చెల్లింది.

చంద్రబాబు కూడా వారి తప్పులు క్షమించి అక్కున చేర్చుకున్నారు. అలా చేరిన వారు మేము నేను మారిన మనిషులమని అంటే అవునేమో అనుకున్నారు.

కానీ ఇపుడు బాబుని తత్వం బోధపడింది అంటున్నారు. ఏపీలో వైసీపీ దూకుడు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 23 సీట్లు వచ్చి అన్ని రకాలుగా అవకాశాలు మూసుకుపోయిన వేళ అధికారం నిండా అనుభవించిన నేతలు ఫుల్ సైలెంట్ అయిపోయారు.

అదే విధంగా పార్టీని దాని మాననా వదిలేసి ఎవరి దారి వారు చూసుకున్న వారూ ఉన్నారు. ఇక చంద్రబాబు ఏడు పదుల వయసులో ఎండలో వానలో వరదలో ఏపీ అంతటా తిరుగుతూ టీడీపీ సైకిల్ ని అతి కష్టాన తొక్కుతున్నారు. దాంతో బాబుకు అన్నీ బోధపడ్డాయని అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే బాబు నోటి వెంట ఈ మాటలు వచ్చాయని చెబుతున్నారు. తాను గతంలో కఠినంగా ఉండలేకపోయానని కూడా బాబు చెప్పుకున్నారు. అంటే తనకు ఇపుడు సర్వం అర్ధమైంది అని ఆయనే అన్నట్లుగా చూడాలి.

అంతే కాదు బాబు మరో మాట కూడా అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే ఇక మీదట అవకాశాలు ఉంటాయని క్లారిటీగా చెప్పేశారు.

ఎవరైతే పార్టీ జెండా భుజాలకెత్తుకుంటారో వారిదే రేపటి రోజు, వారికే టీడీపీలో పెద్ద పీట అని కూడా బాబు శుభ వాక్యం పలికారు. ఇక పార్టీ కోసం పని చేయని వారి జాతకాలను కూడా చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. రికార్డు అంతా తన దగ్గర ఉందని, అన్నీ జాగ్రత్తగా రాస్తున్నాను అని కుండబద్ధలు కొట్టారు.

బాబు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ టీడీపీలో ఉన్న వారికి, పార్టీకి పక్కన పెట్టి సొంత పనులు చూసుకుంటున్న వారికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అనే చెప్పాలి.

అదే విధంగా అధికారాన్ని నిండా అనుభవించి ఎన్నికల వేళ టీడీపీలో జంప్ చేయాలనుకుంటున్న వలస పక్షులకు కూడా ఈ డెసిషన్ డేంజర్ సిగ్నల్ గానే భావించాలి. మొత్తానికి బాబు మారారు. క్యాడర్ ఏమాశిస్తోందో అలాగే మారారు. అయితే ఈ మారినది ఎన్నికల వేళ పూర్తిగా అమలు చేస్తే కనుక టీడీపీలో నిజమైన వారికి న్యాయం జరుగుతుంది.