Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిపై.. చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   16 Sept 2022 10:42 AM IST
అమ‌రావ‌తిపై.. చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్‌
X
జగన్ సహా అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేశామని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ఇదే అంశానికి ఇప్పటికీ కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతిపై...సీఎం మాట తప్పి, మడమ తిప్పరాని మండిపడ్డా రు.

స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా అమరావతికి ప్రణాళికలు చేశామని, ఖర్చు లేకుండానే 33వేల ఎకరాల భూ సమీకరణ చేసి మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్రమంతటికీ సంపద సృష్టి కేంద్రమవుతుందని తెలిపారు.

రాజధాని భూముల్లో ఎలాంటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు చెంప చెళ్లుమని పించేలా తీర్పు చెప్పినా...వైసీపీ నేతలు మూడేళ్ళ నుంచి ఒకే పాట పాడుతున్నారని చంద్ర‌బాబు దుయ్యబట్టారు.

2014కు ముందు ఎసైన్డ్‌ భూములు ఎవరి పేరు మీద ఉంటే... వారికే పట్టాలు ఇచ్చేలా త‌మ‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ భూములు తమ పేరు మీదకు మారవని తెలిసి కూడా... నారాయణో, మరొకరో ఎందుకు కొంటారని ప్రశ్నించారు.

విజయవాడలో కనకదుర్గ ఫ్లైవోవర్‌ని పూర్తి చేస్తే, తాను నిర్మించినట్టుగా జగన్‌ సభలో చెప్పడం ఆయన వైఖరిని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు. ఖర్చులేకుండా అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా తీర్చిదిద్దుతామ‌న్నారు.

జగన్ సహా అందరి ఆమోదంతో అమరావతిని ఖరారు చేశామ‌న్న‌ చంద్ర‌బాబు తెలుగుదేశం మాట ఇప్ప‌టి వ‌ర‌కు తిప్ప‌లేద‌ని, కానీ, వైసీపీనే అనేక విధాలుగా మాట‌లు తిప్పుతోంద‌ని అన్నారు. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా అమరావతికి ప్రణాళికలు రూపొందించామ‌న్నారు. టికెట్లు రావని కొంతమంది.. టికెట్లు ఇచ్చినా గెలవమని మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నా రని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.