Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు చంద్ర‌బాబు రిట‌ర్న్‌ గిఫ్ట్‌?

By:  Tupaki Desk   |   25 Dec 2022 8:00 AM IST
కేసీఆర్‌కు చంద్ర‌బాబు రిట‌ర్న్‌ గిఫ్ట్‌?
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న పాత శ‌తృవు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రిట‌ర్న్ ఇస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఖ‌మ్మంలో అడుగు పెట్టారు. 2018 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఇలా అడుగు పెట్ట‌డం భారీ స‌భ పెట్ట‌డం ఇదే తొలిసారి. అయితే..ఇప్పుడు అనూహ్యంగా ఎందుకు ఇంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు? అనేది చ‌ర్చ‌.

2019లో ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డేలా కేసీఆర్‌.. స‌హ‌క‌రించారు. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో క‌లిసి.. తెలంగాణ‌లో పోటీ చేసిన చంద్ర‌బాబు కేసీఆర్‌ను ఓడించే ప్ర‌య‌త్నం చేశార‌ని.. దానికి రిట‌ర్న్ గిఫ్టుగా.. ఏపీలో చంద్ర‌బాబును ఓడిస్తామ‌ని.. అప్ప‌ట్లో కేసీఆర్ ప్ర‌క‌టించి.. అంత‌ప‌నీ చేశారు. ఇప్పుడు దానికి బ‌దులుగా చంద్ర‌బాబు కూడా రిట‌ర్న్ గిఫ్టు ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల ద‌న్నుతోనే చంద్ర‌బాబు.. ఇప్పుడుతెలంగాణ‌లో దూకుడుగా ముందుకు సాగు తున్నార‌ని చెబుతున్నారు. ఆయ‌న వెనుక బీజేపీ పెద్ద‌లు మోడీ, అమిత్‌షాలు ఇద్ద‌రూ ఉ న్నార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని క‌మ‌ల నాథులు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వారుచంద్ర‌బాబును పంపించి.. పాత‌కాపులు వ‌చ్చేలా.. టీఆర్ ఎస్ ఓటు చీలిపోయి.. త‌మ‌కు మేలు చేసేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

ఇక‌, అదేస‌మ‌యంలో వైసీపీకి కూడా చెక్ పెట్టేందుకు బీజేపీతో పొత్తులో ఉన్న జ‌నసేన‌తో పొత్తు పెట్టుకు నేందుకు కూడా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ రెండు ప్ర‌యోగాల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ద్వారా అటుకేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌డంతోపాటు.. ఇటు ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఉభ‌య కుశ‌లోప‌రి అన్న‌ట్టుగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈసారి కేసీఆర్‌కు తెలంగాణ సెంటిమెంటును ర‌గిలిచే చాన్స్ కూడా లేక‌పోవ‌డం.. చంద్ర‌బాబుకు క‌లిసి వ‌చ్చే అంశంగా చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.