Begin typing your search above and press return to search.
సొంత ప్రాంతంలో రీపోలింగ్..చంద్రబాబు అసహనం!
By: Tupaki Desk | 16 May 2019 11:59 AM ISTఏప్రిల్ పదకొండున ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో బాగా రచ్చ జరిగిన నియోజకవర్గాల్లో ఒకటి చంద్రగిరి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ తలపడిన ఈ నియోజకవర్గంలో కొన్ని చోట్ల పోలింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బూత్ క్యాప్చరింగ్, దళితులను ఓటేయడానికి అనుమతించకపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయక్కడ. ఆ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
ఆ ఫిర్యాదును ఇన్ని రోజులూ పరిశీలించింద ఎన్నికల కమిషన్. ప్రత్యేకించి సీసీ టీవీ పుటేజీలను తెప్పించుకుని చూసినట్టుగా తెలుస్తోంది. దీంతో అసలు గుట్టు బయటపడింది. అక్కడ పోలింగ్ సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ఎన్నికల కమిషన్ నిర్ధారణకు వచ్చింది. దీంతో అక్కడ రీ పోలింగ్ కు ఆదేశించింది.
చంద్రగిరి నియోజకవర్గంలో ఆరు పోలింగ్ బూత్ లలో ఎన్నికల కమిషన్ రీ పోలింగ్ కు ఆదేశించింది. ఆఖరి విడత పోలింగ్ లో భాగంగా ఈ బూత్ లలో మళ్లీ ఓటింగ్ జరగనుంది.ఈ పరిణామం పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండి పడుతున్నారట. చంద్రబాబు నాయుడి సొంతూరు చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సొంత ప్రాంతంలో రీ పోలింగ్ జరగబోతోందని స్పష్టం అవుతోంది. రీ పోలింగ్ విషయంలో ఎన్నికల కమిషన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేసిందని చంద్రబాబు నాయుడు అంటున్నారని సమాచారం.
చంద్రగిరి పరిధిలో కొన్ని బూత్ లలో రీపోలింగ్ ను డిమాండ్ చేస్తూ తాము కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, అయితే తాము ఫిర్యాదు చేసిన బూత్ లలో రీ పోలింగ్ కు ఒప్పుకోని ఎన్నికల కమిషన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడు బూత్ లలో రీ పోలింగ్ చేయాలని డిమాండ్ చేయగా అందులో ఐదు బూత్ లకు ఓకే చెప్పిందని బాబు అంటున్నారు. ఇదంతా ఈసీ పక్షపాత ధోరణికి నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్టుగా సమాచారం. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కు లేఖ కూడా రాయబోతున్నారని తెలుస్తోంది.