Begin typing your search above and press return to search.
ఏపీ సచివాలయ ఉద్యోగులకు తోఫాలే తోఫాలు
By: Tupaki Desk | 22 Jun 2016 12:45 PM ISTపని ఎంత చేస్తారో కానీ.. ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కారు కల్పిస్తున్న వసతులు చూస్తుంటే ఎంతటి వాడికైనా అసూయ పుట్టాల్సిందే. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా.. ఉద్యోగులు కోరుకున్నవన్నీ తీర్చేందుకు కంకణం కట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటికే ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి వస్తున్న నేపథ్యంలో వారికి.. 30 శాతం హెచ్ ఆర్ ఏకు అవకాశం ఇవ్వటం తెలిసిందే.
దీంతో పాటు.. సచివాలయ ఉద్యోగులు కొందరు కోరుకున్నట్లే బెజవాడ – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేయించిన చంద్రబాబు.. తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చే అధికారులకు ఒక అవకాశాన్ని కల్పించారు.
అదేమంటే.. సదరు అధికారులు అమరావతికి తరలి వచ్చినా.. హైదరాబాద్ లో వారికి కేటాయించిన క్వార్టర్లను ఖాళీ చేయాల్సిన అవసరం లేదంటూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. క్వార్టర్లలో ఉన్న ఉద్యోగులకు తాజా నిర్ణయం ఒక వెసులుబాటుగా మారనుంది. తమ పని తీరుతో ఏపీ రాష్ట్రాన్ని ఎంత ముందకు తీసుకెళతారో తెలీదు కానీ.. తోఫాల మీద తోఫాల్ని ఇచ్చేందుకు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి ఏ మాత్రం వెనుకాడటం లేదని చెప్పాలి.