Begin typing your search above and press return to search.
అచ్చమైన అమాయకుడు బాబే... ?
By: Tupaki Desk | 23 Nov 2021 5:00 AM ISTచంద్రబాబు ఏంటి అమాయకుడు ఏంటి అన్న ప్రశ్న ఎవరికైనా తలెత్తవచ్చు. ఆయన రాజకీయ గండర గండడు కదా. అపర చాణక్యుడు కదా అని కూడా ఆలోచించవచ్చు. చంద్రబాబుకు ఉన్న తెలివి తేటలు కానీ ఆయన ముందు చూపు కానీ ఎవరికీ లేవు కదా అని వాదించవచ్చు. అయితే చంద్రబాబు మాత్రం కొన్ని విషయాల్లో అచ్చమైన అమాయకుడే అన్నది మాత్రం కొన్ని రకాలుగా చూసినపుడు అనిపించే విషయం. నిజమే అమాయకత్వం అంటే కొన్ని విషయాలు తెలియకపోవడం, తెలిసినా అర్ధం చేసుకోలేకపోవడం. కొన్ని సార్లు అన్నీ తెలిసి కూడా పదే పదే మోసపోవడం. మరి ఇలాంటి వాటిని అమాయకత్వం కాక మరేమని అంటారు. ఆ విధంగా కనుక తర్కిస్తే మాత్రం చంద్రబాబు రాజకీయ అమాయకుడే అని చెప్పాలి.
ఆయన ఒక విధంగా అందరినీ అంచనా వేసుకుంటానని అనుకుంటారు కానీ ఆయన అంచనాలు తప్పు అయిన సందర్భాలు ఎన్నో. ఉదాహరణకు 2018 వేళ బీజేపీ నుంచి హఠాత్తుంగా బంధం తెంచుకుని బయటకు రావడం బాబు చేసిన అతి పెద్ద రాజకీయ తప్పు. ఈ తప్పు వెనక కొందరి సలహాలు ఉన్నాయని అంటారు. మరి ఆ సలహాలు విని పాటించిన చంద్రబాబు ఇపుడు అధికారం కోల్పోయి ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు అంటే అది అమాయకత్వం కాక మరేంటి. ఇక చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఎందరికో పదవులు పంచారు. ఎందరినో మంత్రులుగా ఇంకా పెద్దలుగా కూడా చేశారు. వారంతా శాశ్వతంగా తన వైపే ఉంటారని కూడా భ్రమలు పడ్డారు.
గత రెండున్నరేళ్ళుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక వారిలో మెజారిటీ ఈ రోజు ఎక్కడా నోరు విప్పడంలేదు. ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఆఖరుకు చంద్రబాబు కంట కన్నీరు ఒలికినా వారి నుంచి ఏ మాత్రం స్పందన లేదు అంటే బాబు అలాంటి నాయకులను నమ్మి రాజకీయ యుద్ధం చేయడం కంటే అమాయకత్వం వేరే ఉంటుందా. ఇక రాజధాని నడిబొడ్డున కొందరిని బాబు నమ్మి నాయకులను చేశారు. ఎమ్మెల్యేలను చేశారు. వారు సరైన సమయంలో ప్లేట్ మార్చి అవతల పక్షంలో చేరి బాబునే నిందిస్తున్నారు. ఎంతలా అంటే అసలైన ప్రత్యర్ధి వైసీపీ నేతల కంటే దారుణంగా. అసలు బాబు కంట ఇంతలా కన్నీరు కారింది అంటే అలాంటి వారి వల్లనే. మరి అన్నీ తెలిసి బాబు వారిని ఒకనాడు చేరదీయడం కంటే అమాయకత్వం వేరేది ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది.
ఇక బాబులో అమాయకత్వం కోణం గురించి ఇంకో మాట కూడా చెప్పుకోవాలని అంటారు. ఆయనను బాగా తిట్టి బయటకు వెళ్లిన నాయకులు, ఇతర పార్టీలలో అధికారం అనుభవించిన వారు తిరిగి వస్తే బాబు కనీసం పాత విషయాలను మచ్చుకైనా జ్ఞాపకం చేసుకోకుండా చేర్చేసుకుంటారు. అంతే కాదు, వారిని సమాదరించి పెద్ద పీట వేస్తారు. అలాంటి వారు అధికారం పోగానే తిరిగి ఆయన వద్ద నుంచి బయటకు వెళ్లిపోతారు. మరి ఈ సంగతులు తెలిసి కూడా బాబు వారిని దగ్గరకు తీయడం కంటే అమాయకత్వం వేరేది ఉండబోదు అన్నది టీడీపీ అసలు సిసలు తమ్ముళ్ల ఆవేదన.
అదే జగన్ విషయానికి వస్తే ఆయన తనను దూషించిన వారిని అసలు చేర్చుకోరు. వారు మారాం మొర్రో అని మొరపెట్టుకున్నా పట్టించుకోరు. వారి వల్ల రాజకీయ లాభం ఉన్నా దూరం పెడతారు. దాంతోనే జగన్ వద్ద ఉన్న నేతలు వేరే పార్టీలోకి మారాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఒకసారి మారితే మళ్లీ వైసీపీలో చాన్స్ ఉండదన్న సంకేతం జగన్ బలంగా ఇవ్వగలిగారు అంటారు. మరి ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఎందుకు అలా చేయలేకపోతున్నారు అన్నదే ఆ పార్టీలో చర్చ. రెండున్నరేళ్ళుగా బాబు ఒంటరిగానే పోరాడుతున్నారు. పార్టీ పరంగా వచ్చినవి అన్నీ అనుభవించిన వారు ఇపుడు సొంత పనులు చూసుకుంటున్నారు. మళ్లీ టీడీపీకి అనుకూల పవనాలు వస్తే వారే పార్టీలో యాక్టివ్ అయి పదవులు పొందుతారు.
బాబు గతంలో చాలా సార్లు ఇలా చేశారు. అయితే ఇపుడు మాత్రం బాబు మళ్లీ అవకాశవాదులను, పార్టీని పట్టని వారిని చేరదీయవద్దు అని విలువైన సూచనలు అందుతున్నాయి. బాబు ఈసారి తాను మారాలి. తన అమాయకత్వం వీడాలి. పార్టీ కోసం ఎవరు పాటుపడుతున్నారో వారికే టికెట్లు ఇవ్వాలి. నిబద్ధత కలిగిన వారిని ఆదరిస్తే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారే వెంట ఉంటారు అన్నది తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి బాబు అమాయకత్వం మూలంగానే ఈ రోజు టీడీపీలో ఇంతటి నైరాశ్యం కమ్ముకుందని కూడా చెబుతున్నారు. మరి బాబు ఇకనైనా తన పంధాను వీడి కొత్తగా ఆలోచిస్తారా. చూడాలి.