Begin typing your search above and press return to search.
ఏడు జిల్లాల్లో ఎలక్షన్లు..బాబులో టెన్షన్ టెన్షన్
By: Tupaki Desk | 29 Sept 2018 12:35 PM ISTలోక్ సభ - అసెంబ్లీలకు ఎన్నికలు నిర్ణీత సమయం ప్రకారమే మే నెలలో జరిగేటట్లయితే అంతకంటే ముందే ఏపీలోని ఏడు జిల్లాల పరిధిలో కీలక ఎన్నికలు రానున్నాయి. అది అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇంతకీ ఈ ఎన్నికలేంటో చెప్పలేదు కదా.. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలు. అవును... మూడు స్ధానాల్లో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రులు - ఉపాధ్యాయుల కోటాలో మార్చి 29వ తేదీకి మూడు స్ధానాలు ఖాళీ అవనున్నాయి. ఇందులో రెండు పట్టభద్రుల స్ధానాలు, ఒక ఉపాధ్యాయ స్ధానానికి ఎన్నిక జరుగుతుంది. షెడ్యూల్ ఎన్నికలకు ముందు మూడు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజల నాడి తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు కీలకం అని అంతా భావిస్తున్నారు.
తర్వలో జరగబోయే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉభయగోదావరి జిల్లాల్లో - కృష్ణా - గుంటూరు - శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం జిల్లాల్లో జరుగుతున్నాయి. పట్టభద్రులకు జరగబోయే ఎన్నికలో ఉభయగోదావరి జిల్లాలు - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ఓటర్లు పాల్గొంటారు. ఇక ఉపాధ్యాయ కోటాలో జరిగే ఎన్నికలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ఓటర్లు పాల్గొంటారు. పోయిన ఎన్నికల్లో పట్టభద్రులు - ఉపాధ్యాయ కోటా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు ఓటు చేసే స్ధానిక సంస్దల ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటర్లను మ్యానేజ్ చేసి టిడిపి గెలిచింది.
ఇప్పుడు జరగబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాల్లోని 7 జిల్లాల ఓటర్లు పాల్గొనబోతున్నారు . అవటానికి ఉపాధ్యాయ - పట్టభద్రుల ఓటర్లే అయినా ఏ పార్టీ విషయంలో జనాల మూడ్ ఎలాగుంది అనే విషయంలో జరగబోయే ఎన్నిక ఒక శాంపిల్ గా ఉపయోగపడుతుంది. అందుకనే అధికార తెలుగుదేశంపార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం వైసిపి - జనసేన - బిజెపి - కాంగ్రెస్ ఇలా అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశాలున్నాయి.అయితే... పట్టభద్రులు - ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో చంద్రబాబు తెగ టెన్షన్ పడుతున్నారట.