Begin typing your search above and press return to search.
బాబు ఆఫర్ః వైసీపీ ఎమ్మెల్యేలు కలిస్తే అభివృద్
By: Tupaki Desk | 27 Nov 2016 11:02 AM ISTకడప జిల్లా కేంద్రం - రాజంపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పర్యటనలో ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రతిపక్షనేతకు వణుకుపుట్టిందని, దాచుకున్న డబ్బంతా ఏం చేయాలో తెలియక పిచ్చిపట్టిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల్లో తమకు మంచి పేరు వస్తుంటే విపక్ష నేత ఓర్వలేక ప్రాంతాలవారీగా పర్యటిస్తూ తన తండ్రి హయాంలో స్థాపించిన - మొదలుపెట్టిన పనులపై రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు చేసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్ అధికారంలోకి రావడం కలేనన్నారు.
కులాలు - మతాల పేర చిచ్చుపెట్టి ప్రజల్లో అశాంతి కలిగించాలని ప్రయత్నించారని, అయితే ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయనీ చంద్రబాబు అన్నారు. వైఎస్ కుటుంబం హయాంలో ఏనాడైనా పులివెందులకు చుక్కనీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. జలయజ్ఞం పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ధన యజ్ఞంగా మార్చుకున్నారని ఆరోపించారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని, తమను ఎవ్వరూ గుర్తించడం లేదని ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యేలు తనను కలిసి మొరపెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకింత గర్వంగా ప్రకటించారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు అభివృద్ధికోసం కృషి చేస్తుంటే దివంగత సీఎం వైఎస్ టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కొని అరకొర అభివృద్ధి చేశారని గతం గుర్తు చేశారు. అభివృద్ధిని ఆంకాంక్షించే వైకాపా ఎమ్మెల్యేలు తమ నేతలతో కలిసి సమన్వయంతో పనిచేసేందుకు వస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చంద్రబాబు ఆసక్తికరమైన ప్రతిపాదన పెట్టారు.
కాగా కడప జిల్లాలో ఎక్కడా లేనన్ని వనరులు ఉన్నాయని బంగారం పండించే రైతాంగం జిల్లాలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. రైతులు ప్రస్తుత పరిస్థితులపై దిగులు పడవద్దని, నగదు రహిత చెల్లింపుల ద్వారా రైతులను కూడా ఆదుకుంటామని, కష్టాలు దూరమవుతాయని తెలిపారు. కడప జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, అలాగే పరిశ్రమల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పే విషయంగా కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామన్నారు. కడప ఎయిర్ పోర్టు పక్కన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఒంటిమిట్ట దేవాలయాన్నిఅభివృద్ధి పరిచామని - గండికోటను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దోమల దండయాత్ర కార్యక్రమం కారణంగా ప్రజల్లో చైతన్యం వచ్చిందనీ, ఈ కారణంగా దోమలు తగ్గుముఖం పట్టాయని రోగాలు కూడా సంభవించడంలేదని చంద్రబాబు చెప్పారు. ప్రతి శనివారం మధ్యాహ్నం విద్యార్థులు - ఉద్యోగులు - ఉపాధ్యాయులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలన్నారు. దీంతో స్వచ్ఛాంధ్రప్రదేశ్ - వనం-మనం - నీటి సంరక్షణ లాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత పాలకుల అవినీతి కారణంగా పేదలకు ఇచ్చే పెన్షన్లు పక్కదారిపట్టాయని - చనిపోయిన వారి పెన్షన్లను సైతం దళారులు స్వాహా చేశారన్నారు. కానీ ప్రస్తుతం ఎటువంటి అక్రమాలు లేకుండా ఖచ్చితంగా పెన్షన్లు అందే విధంగా చర్యలు చేపట్టామనీ, చౌక దుకాణాల ద్వారా సక్రమంగా కార్డుదారులకు రేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/