Begin typing your search above and press return to search.

బాబును న‌వ్వించిన అభిమాని కానుక‌!

By:  Tupaki Desk   |   4 May 2019 10:18 AM GMT
బాబును న‌వ్వించిన అభిమాని కానుక‌!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముఖంలో న‌వ్వులు క‌నిపించనే క‌నిపించ‌వు. ఎప్పుడూ గంభీరంగా.. సీరియ‌స్ గా ఉండే ఆయ‌నలో అంతో ఇంతో మార్పు వ‌చ్చిందంటే అది దివంగ‌త మ‌హానేత వైఎస్ క్రెడిట్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. విప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును ఉద్దేశించి అప్ప‌ట్లో సీఎంగా ఉన్న వైఎస్ చేసే వ్యంగ్య వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో త‌న తీరును మార్చుకున్నారు. ఇప్ప‌టికి బాబు ముఖంలో న‌వ్వులు చాలా అరుదుగా మాత్ర‌మే వ‌స్తుంటాయి.

అలాంటి బాబు ముఖంలో న‌వ్వులు విర‌బూసేలా చేశారు ఒక అభిమాని. ఊహించ‌ని రీతిలో చంద్ర‌బాబు కోసం ఒక బ‌హుమ‌తి తీసుకొచ్చారు చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పార్టీ అభిమాని రామానుజం చ‌ల‌ప‌తి. బాబును క‌లిసిన ఆయ‌న‌.. చివ‌ర్లో త‌న‌తో తెచ్చిన రెండు బ‌హుమ‌తుల్ని బాబుకు ఇచ్చారు. ఇంత‌కీ ఆయ‌న ఇచ్చిన గిఫ్ట్ లు ఏమిటో తెలుసా? క‌్యారేజీ.. గ‌డియారం.

ఎందుకివ‌న్ని అన్న బాబు ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన అభిమాని.. సార్ మీరు ప‌నిలో ప‌డి తిండి కూడా తిన‌రు. ఈ గ‌డియారం చూసుకొనైనా స‌మ‌యానికి భోజ‌నం చేయాలి. అందుకే క్యారేజీ.. గ‌డియారం తెచ్చాన‌ని చెప్పారు. అభిమాని మాట‌తో ఒక్క‌సారిగా న‌వ్వేశారు చంద్ర‌బాబు. మొత్తానికి బాబు ముఖంలో న‌వ్వు తెప్పించిన చ‌ల‌ప‌తి తెలివికి బాబు చుట్టుప‌క్క‌ల ఉన్నోళ్లు మురిసిపోయారు. కానీ.. చాలామందికి తెలీని విష‌యం ఏమిటంటే.. చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి.. బాబు బాగోగులు..ఏం తినాలి? ఏం తిన‌కూడ‌ద‌న్న విష‌యాలు చూసుకునేందుకు ఒక వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడ్ని ఏర్పాటు చేశారు.

ఆమె ఏం చెబితే అవి మాత్ర‌మే బాబుకు ఇవ్వాల‌న్న క‌చ్ఛిత‌మైన ఆదేశాలు ఉన్నాయి. అవెంతంటే.. బాబుకు ఏదైనా తినాల‌నిపించినా.. స‌ద‌రు స‌హాయ‌కుడు ఒప్పుకోనంత‌. వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజ‌మేన‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. ఈ విష‌యం స‌ద‌రు అభిమానికి తెలీకున్నా.. బాబు గురించి తానెంత ఆలోచిస్తానన్న విష‌యాన్ని త‌న బ‌హుమ‌తుల‌తో చెప్పేశాడ‌ని చెప్పాలి.