Begin typing your search above and press return to search.
బాబు కామెంట్లు బాగానే ఉన్నా.. బూమరాంగ్ అవుతాయేమో...!
By: Tupaki Desk | 10 Dec 2021 3:09 PM IST‘‘పార్టీలో కోవర్టులు తయారయ్యారు. వారిని ఏరిపారేస్తా’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘‘ఒక్క కుప్పమే కాదు... మరి కొన్నిచోట్ల కూడా ఈ కోవర్టులు తయారయ్యారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. కేసులు, దాడులకు భయపడకుండా వేల మంది పార్టీ కార్యకర్తలు పోరాడు తుంటే కొంత మంది ప్రత్యర్థులకు భయపడి లొంగిపోయి వ్యవహరిస్తున్నారు.
అటువంటి వారిని ఉపేక్షించే సమస్య లేదు’’ అని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో పనిచేయకుం డా తనను మెప్పించడం కోసం ప్రయత్నిస్తే ఏం ఉపయోగం ఉండదని, ప్రజల్లో పనిచేసే వారినే పార్టీ గుర్తిస్తుందని చెప్పారు.
ఓకే! ఇన్నాళ్లకు ఒక సూపర్ విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. సో.. ఆయన పార్టీని లైన్‌లో పెట్టడానికి వేసిన తొలి అడుగు అద్భుతమే! ఈ విషయంలో సందేహమూ లేదు. ఎందుకంటే.. కోవర్టులు, భజన పరులు.. పార్టీలకు.. అది టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. జనసేన అయినా.. ఇప్పుడు ప్రధానంగా ఇబ్బందికరంగానే మారారు.
వారి వల్ల పార్టీ ఎదుగుదల మాట ఎలా ఉన్నా.. పార్టీ ఘోరమైన పరిస్థితికి మాత్రం చేరుతోంది. ఈ నేపథ్యంలో కోవర్టులకు చెక్ పెట్టడం తన ప్రధాన బాధ్యతగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అదేసమయంలో భజన పరులను కూడా చూస్తూ.. ఊరుకోనని.. అందరూ జెండాలు పట్టుకుని జనంలోకి వెళ్లాలని ఆయన సూచించారు.
చంద్రబాబు ప్రకటించిన.. ఈ రెండు ఉద్దేశాలు కూడా చాలా మంచివే. కానీ, వాస్తవానికి ఈ రెండు విధానా లను అమలు చేసింది.. పాటించింది.. ఎవరు? అనే ప్రశ్న వస్తే.. మాత్రం అందరి వేళ్లూ.. బాబువైపే చూపి స్తున్నారు. కోవర్టులను తయారు చేసేదే చంద్రబాబు అని గతంలో కీలక నాయకుడు.. అది కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చిన నాయకుడే వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు.. సీఎం రమేష్, సుజనా చౌదరి.. వంటివారు రాత్రికి రాత్రి మనసు మార్చుకుని.. పార్టీ మారిపోయి.. జెండాలు మార్చుకుని బీజేపీ పంచన చేరిపోవడం అంటే.. వీరు కూడా ఈ కోవలోకే రారా?! అనేది సందేహం.
మరి వీరి వెనుక ఎవరున్నారు? అనేది ఇప్పుడు బాబుకు ఎదురవుతున్న ప్రధాన ప్రశ్న. అంతేకాదు. భజన పరుల విషయంలో ఆది నుంచి పెంచి పోషించింది ఎవరు? తనకు అనుకూలంగా మాట్లాడిన వారికి, తన తరఫున ప్రచారం చేసిన వారిని, తను ఎటు తిరిగితే అటే.. తిరిగిన వారికి.. పదవులు ఇచ్చింది ఎవరు? అందలాలు ఎక్కించింది ఎవరు? ఈ ప్రశ్నలకు కూడా అన్ని వేళ్లు బాబువైపే చూపడం దారుణమే!! అంటే.. ఏ రెండు ఇప్పుడు చంద్రబాబు కు తీవ్ర ఇబ్బందిగా మారాయో.. వాటిని ఆయనే నిన్న మొన్నటి వరకు పెంచారు.. పోషించారు.. నిర్దేశించారు. కానీ.. ఇప్పుడు సెగ తగులుతుంటే.. మాత్రంతట్టుకోలేక పోతున్నారన్నమాట!!