Begin typing your search above and press return to search.
జగన్ ఆలోచన - చంద్రబాబు అమలు
By: Tupaki Desk | 5 Jun 2019 3:41 PM IST40 ఏళ్ల అనుభవంలో చంద్రబాబు ఏం నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా... మార్పును స్వీకరించడం మాత్రం చాలా త్వరగా నేర్చుకున్నారు. ఇతరుల ఐడియాను ఫాలో అవడానికి సిగ్గుపడరు. అందుకు తన శిష్యుడి ఐడియా అయిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టాడు. అయినా ఫలితం లేదు, అది వేరే విషయం. తాజాగా ఓటమి దిగులులో ఉన్న పార్టీకి చంద్రబాబు భరోసా పాఠాలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా పోరాడం చేయడానికి పార్టీ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ ఐడియాను జగన్ కంటే ముందే ఫాలో అయిపోయారు.
ఎన్నికల ముందు వైఎస్ జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చాక కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయబోతున్నట్టు జగన్ ప్రకటించారు. అయితే, దీనికి ఇంకా అధికారిక ప్రక్రియ ప్రారంభం కాలేదు. జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు ముందే ఫాలో అయిపోతున్నారు. కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయంపై మరింత గట్టిగా పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్ గా కొత్త కమిటీలను చంద్రబాబు ఏర్పాటుచేస్తున్నారు.
గతంలో జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని ఈ కమిటీలను ఏర్పాటుచేసేవారు. అయితే, జగన్ కొత్త జిల్లాల ప్రకటన చేయడంతో జిల్లాల ఏర్పాటుతర్వాత పార్టీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందే ప్లాన్ చేసుకుంటున్నారు చంద్రబాబు. ఎలాగూ జగన్ కచ్చితంగా అమలుచేస్తాడని నమ్మిన బాబు 25 జిల్లాల ఆలోచనకు అనుగుణంగా పార్టీని పునర్నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా పలువురు నేతలతో సమావేశమైన బాబు. మనది రాజకీయ పార్టీ. గెలిచినా ఓడినా పోరాడాలి. బాధపడితే పోరాడలేం, మరింత ఉత్సాహంతో ముందుకు సాగండి, అని పరిస్థితులకు సిద్ధం కండి... అని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు.