Begin typing your search above and press return to search.
చంద్రబాబు పంచ్ మామూలుగా లేదుగా..!
By: Tupaki Desk | 16 Dec 2021 2:02 PM ISTమాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ లు పెడుతూ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూ వస్తున్నారు. తాజాగా ఆయన మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రభుత్వంపై తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిందని... అయితే ఇప్పటి వరకు మూడు టాయ్‌లెట్లు కూడా కట్టలేదు కానీ... అలాంటి ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుందా ? అని ఎద్దేవా చేశారు.
ఓ వైపు ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ప్రభుత్వాన్ని అడుగుతుంటే... ప్రభుత్వ పెద్దలు మాత్రం తిరిగి ఉద్యోగులను టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా సి పిఎస్ రద్దుపై జగన్ హామీ ఎక్కడికి పోయింది అని చంద్రబాబు ప్రశ్నించారు. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలా జగన్ వైఖరి ఉందని కూడా బాబు ఎద్దేవా చేశారు. రెండున్నర సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ధ్వంసం అయిపోయిందని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం పాలన ఎలా ? చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతోందని... ఇక్కడ రోజు గడవక ఢిల్లీలో వైసీపీ ప్రభుత్వం బిచ్చం ఎత్తుకుంటోందని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. తమను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ముందు సాగిలపడుతోన్న ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు గురించి అడిగే దమ్ము లేదా ? అని దుమ్మెత్తిపోశారు
రాష్ట్రంలో కొందరు మేధావులు వైసీపీ ప్రభుత్వానికి భజన చేసే పేటీఎం బ్యాచ్ లా తయారయ్యారని బాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మద్యం, భూములు... ఇసుక, మైనింగ్ ఇలా అన్నింటిని దోపిడీ చేస్తున్నారని... ప్రభుత్వమే కబ్జా కోరగా మారిపోయిందని బాబు నిప్పులు చెరిగారు. ఒక జడ్జి ఇక్కడకు వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని మాట్లాడారని... కానీ రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పరిస్థితులు వారికి కనపడవా ? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఏపీలో జరుగుతున్న ఆత్మహత్యలు, అల్లకల్లోల లు ఆ జడ్జిలకు ఎందుకు ? కనపడవు అని ఇలాంటి నేర గాడికి వారు ఎందుకు ? మద్దతు ఇస్తారంటూ బాబు ప్రశ్నించారు. ఇక కొందరు న్యాయమూర్తులు సైతం రిటైరయ్యాక పదవుల కోసం ఈ నేరగాళ్లకు సపోర్ట్ చేయడం ఎంతవరకు ? సమంజసం అని ప్రశ్నించారు.