Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు ఆగస్టు 14 భయం
By: Tupaki Desk | 8 Aug 2019 7:00 AM ISTకష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం చంద్రబాబుకు కత్తిమీద సాములా మారింది. సప్త సముద్రాలు ఈదిన గజ ఈతగాడు ఇంటెనుక పిల్ల కాలువను దాటలేకపోయాడన్నట్లుగా.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో డక్కామొక్కీలు తిని.. ఎంతో పెద్ద సమస్యలను ఈజీగా దాటుకుంటూ వెళ్లిన చంద్రబాబు ఇప్పుడు చచ్చీచెడీ గెల్చిన 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలాగో తెలియక జుత్తు పీక్కుంటున్నారు.
ఇప్పటికే ఎంతో మంది నేతలు పార్టీని వీడి వెళ్లా.. ఇంకా మరికొందరు కూడా వెళ్లే ఉద్దేశంలో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ ఈ నెల 14న నిర్వహించే పార్టీ విస్త్రత స్థాయి సమావేశంలో వారిని ఎంతవరకు బుజ్జగించగలను... ఎంతవరకు వారిని పార్టీలోనే ఉండేలా చేయగలను.. అసలింతకూ ఫిరాయింపు ఆలోచనలలో ఉన్న నేతలు ఈ సమావేశానికి వస్తారా.. రాకపోతే ఏమవుతుంది.. కాపు నేతలు తనపై విరుచుకుపడతారేమో.. కేశినేని నాని ఏం కొంప ముంచుతాడో.. బోండా వెంకన్న ఎలా భయపెడతాడో అనుకుంటూ చంద్రబాబుకు కంటిమీద కునుకు రావడం లేదని చెబుతున్నారు ఆయన అనుచరులు.
మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేక ఇప్పటికే కొందరు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసేశారు. కడపలో వీరశివారెడ్డి, విజయవాడలో దేవినేని అవినాష్, అనంతపురంలో వరదాపురం సూరి, కర్నూలులో భూమా మహేష్ రెడ్డి- భూమా కిషోర్ రెడ్డి- గుంటూరులో చందు సాంబశివరావు, ప్రకాశం జిల్లాలో ఈదరి హరిబాబు లాంటి నేతలు టిడిపిని వదిలేసి బిజెపిలో చేరారు. నలుగురు రాజ్యసభ సభ్యులూ బీజేపీలోకి వెళ్లిపోయారు. టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ ఏల్లో 16 మంది టిడిపిలో నుండి తమ పార్టీలోకి జంప్ చేయటానికి రెడీగా ఉన్నట్లు బిజెపి నేతలు పదే పదే చెబుతున్నారు. ఇందులో ఎంతనిజమో తెలీదు కానీ బిజెపిలోకి వెళ్ళటానికి కొంతమంది ఎంఎల్ఏలైతే రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది.
గంటా శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్ లాంటి ఎంఎల్ఏ ఇప్పటికే బిజెపి ఢిల్లీ నాయత్వంతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇక విజయవాడ ఎంపి కేశినేని నాని అయితే చంద్రబాబుకే డైరెక్టుగా వార్నింగులు ఇచ్చిన విషయం అందరూ చూసిందే. పార్టీలోని కాపు నేతలు చంద్రబాబుతో సంబంధం లేకుండానే ప్రత్యేక సమావేశాలు పెట్టుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో చాలామంది ఎంఎల్ఏలు చంద్రబాబుకు మద్దతుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇవన్నీ చూస్తుంటే పార్టీ నుండి ఏరోజు ఏ నేత వెళిపోతారో అర్ధంకాక క్యాడర్ మొత్తం అయోమయంలో ఉంది. అందుకే ఆగస్టు `14న జరగబోయే విస్తృత స్థాయి సమావేశం తరువాత పార్టీ ఉంటుందా ఊడుతుందా అని చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలూ టెన్షన్ పడుతున్నారట.