Begin typing your search above and press return to search.

బీజేపీతో దోస్తీ కోసం.. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు..

By:  Tupaki Desk   |   31 Oct 2019 10:25 AM GMT
బీజేపీతో దోస్తీ కోసం.. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు..
X
అధికారం పోయింది.. నేతలు జారిపోతున్నారు.. ఎన్నికలకు ముందర చంద్రబాబు వేసిన కుప్పిగంతులు అన్నీ ఇన్నీ కావాయే.. బీజేపీ పెద్దాయన మోడీతోనే గేమ్స్ ఆడి ప్రతిపక్షాలను కూడగట్టి.. ఢిల్లీలో అడుగుపెట్టి.. కాంగ్రెస్ తో జట్టుకట్టి మోడీని ఎన్ని అనాలో అన్నీ అనేశాడు చంద్రబాబు. అయితే కాలం మాత్రం బాబును పగబట్టింది. మాటలు పడ్డ మోడీ గెలిచేశాడు.. బాబు ఓడిపోయాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో బాబు పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకు బీజేపీ పెద్దలు అంతగా చంద్రబాబుపై దృష్టి పెట్టలేదని అంతుచిక్కని ప్రశ్న...

ఇక కాంగ్రెస్ తో పాడు స్నేహం చేసి దెబ్బైపోయానని ఒకానొక భోధి చెట్టుకింద చంద్రబాబుకు జ్ఞానోదయం అయిపోయింది. నేతలంతా జారిపోవడంతో తత్త్వం బోధపడింది. బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకోవడమే బాబు కొంపముంచిందని అందరూ ఆడిపోసుకోవడంతో తెలిసివచ్చింది. దీంతో చంద్రబాబు మళ్లీ బీజేపీతో దోస్తీకి వెంపర్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా రాయబారం కూడా పంపేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం నాగపూర్ వెళ్లి మరీ బీజేపీకి పెద్ద దిక్కు అయిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో భేటి అయ్యారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో వీరిద్దరి భేటి సుమారు రెండు గంటల పాటు సాగింది.

అయితే చంద్రబాబు తన భేటి విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడడంతో విషయం అంతగా వెలుగులోకి రాలేదు.

బీజేపీతో దోస్తీ కోసమే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ద్వారా చంద్రబాబు రాయబారం నడుపుతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ప్రధానంగా రాజకీయాలే చర్చకు వచ్చినట్టు తెలిసింది. కేంద్రమంత్రి గడ్కరీ రాయబారంతోనే వీరిద్దరి భేటి జరిగినట్టు సమాచారం. మోడీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్ ద్వారా నరుక్కురావడానికి ప్రయత్నాలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మరి బాబుపై పీకల్లోతూ కోపంగా ఉన్న మోడీ కరుణిస్తాడా లేడా అన్నది వేచిచూడాలి.